Begin typing your search above and press return to search.

విడాకుల విషయంలో ఫిలిప్పీన్స్ సంచలన నిర్ణయం!!

ఈ సృష్టి మనుగడకు కారణమైంది పవిత్రమైన వివాహ బంధం అనేది తెలిసిన విషయమే

By:  Tupaki Desk   |   29 May 2024 5:47 AM GMT
విడాకుల విషయంలో ఫిలిప్పీన్స్ సంచలన నిర్ణయం!!
X

ఈ సృష్టి మనుగడకు కారణమైంది పవిత్రమైన వివాహ బంధం అనేది తెలిసిన విషయమే. ఈ బంధాన్ని చాలా మంది నూరేళ్ల పంటగా భావిస్తే.. మరికొంతమంది మాత్రం పలు రకాల కారణాలతో మూణాళ్ల ముచ్చటగా ముగించుకుంటూ ఉంటారు. పైగా ఇటీవల కాలంలో భారతదేశం లాంటి దేశాల్లో కూడా చిన్న చిన్న కారణాలకు సైతం విడాకులు తీసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... తలుపుకు గొళ్లెం పెట్టలేదని, పొయ్యిమీద కాఫీ పెట్టలేదని, కుక్క మెడలో గొలుసు కట్టలేదని రకరకాల సిల్లీ రీజన్స్ తో విడాకులు తీసుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఫిలిప్పీన్స్ లో విడాకులు తీసుకోవడానికి అనుమతించని వాటికన్ మినహా ఫిలిప్పీన్స్ పరిస్థితిని సరిదిద్దడానికి మొదటి అడుగు వేసింది.

వివరాళ్లోకి వెళ్తే... దేశంలో విడాకులను చట్టబద్ధం చేసే బిల్లును ఫిలిప్పీన్స్ పార్లమెంట్ దిగువ సభ ఆమోదించింది. ఈ సందర్భంగా స్పందించిన బిల్ రచయిత ప్రతినిధి ఎడ్సెల్ లాగ్‌ మాన్... విడాకులు ఇప్పటికీ చట్టవిరుద్ధంగా ఉన్న వాటికన్‌ తో పాటు ప్రపంచంలోని ఏకైక దేశం.. ఇది స్పష్టమైన, అద్భుతమైన విజయం అని పేర్కొన్నారు. ఈ క్రమంలో బిల్లు ఆగస్టులో సెనేట్‌ కు వెళుతుంది.

అనంతరం ఇది చట్టంగా మారడానికి రాష్ట్రపతి ఆమోదం అవసరం. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌ లో దాని ఆమోదం అనేది "వివాహ సంబంధాల పట్ల సామాజిక వైఖరిలో గణనీయమైన మార్పును సూచిస్తుంది" అని లాగ్‌ మాన్ అన్నారు. వాస్తవానికి ఇంతకు ముందు ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ విఫలమయ్యాయి.

కాగా... 2020 జనాభా లెక్కల ప్రకారం, కుటుంబ జనాభాలో రోమన్ క్యాథలిక్‌ లు 78.8% ఉన్నారు.. ఇది శాతం పరంగా ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ఇదే సమయంలో ముస్లింలు (6.4%) రెండవ అతిపెద్ద సమూహం కాగా... ఇక్కడ ముస్లింలు వ్యక్తిగత విషయాలలో షరియా చట్టం ద్వారా విడాకులు తీసుకునే హక్కును కలిగి ఉన్నారు.

అయితే... సాంప్రదాయ క్రైస్తవులకు, ప్రత్యేకంగా కాథలిక్‌ లకు.. వివాహాన్ని కేవలం జీవిత భాగస్వామికి మాత్రమే కాకుండా దేవునికి, సమాజానికి చేసే పవిత్రమైన నిబద్ధతగా చూస్తారు. ఒకవెళ వివాహిత కాథలిక్ జంటలు కొన్ని సందర్భాల్లో విడిపోవచ్చు కానీ... వారు తిరిగి చర్చిలో పెళ్లి చేసుకోలేరు.