Begin typing your search above and press return to search.

ఫోన్ పే... ఒక్క నెలలో 722 కోట్ల లావాదేవీలు..నగదు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?!

భారతదేశంలో ఇప్పుడు చెల్లింపుల విధానం దాదాపు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   14 Oct 2024 7:35 AM GMT
ఫోన్ పే... ఒక్క నెలలో 722 కోట్ల లావాదేవీలు..నగదు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?!
X

భారతదేశంలో ఇప్పుడు చెల్లింపుల విధానం దాదాపు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. జేబులోనో, పర్స్ లోనో నోట్లు తీసుకుని వెళ్లే వారి సంఖ్యా చాలావరకూ తగ్గిపోయిందని అంటున్నారు. పర్సులో కార్డులు, ఫోన్ లో యూపీఐ పేమెంట్ యాప్ లతోనే చాలా మంది ట్రాన్సాక్షన్స్ జరిపించేస్తున్నారు.

రూ. 1 నుంచి లక్ష వరకూ సింగిల్ క్లిక్ తో పని పూర్తిచేసేస్తున్నారు. వ్యాపారస్తులు కూడా వినియోగదారులకు ఈ మేరకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 సెప్టెంబర్ లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ఎకో సిస్టం లో ఓ రికార్డ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఫోన్ పే సరికొత్త రికార్డ్ సృష్టించింది.

అవును... 2016 ఏప్రిల్ లో ప్రారంభమైనప్పటి నుంచీ యూపీఐ మొట్టమొదటిసారిగా 15 బిలియన్ల లావాదేవీలను అధిగమించాయి. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీ.సీ.ఐ.) విడుదల చేసిన డేటా ప్రకారం... ఈ విషయంలో ఫేన్ పే మార్కెట్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

ఇందులో భాగంగా... ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఫోన్ పే రూ.10.30 లక్షల కోట్ల విలువైన 722 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ఆ తర్వాత స్థానంలో రూ.7.46 లక్షల కోట్ల విలువైన 562 కోట్ల లావాదేవీలతో గూగుల్ పే రెండో స్థానంలో కొనసాగుతుంది. అయితే ఆగస్టుతో పోలిస్తే ఫోన్ పే కంటే గూగుల్ పే అభివృద్ధిని సూచిస్తుంది.

ఆగస్టులో ఇదే ఫోన్ పే లావాదేవీల సంఖ్య 723 కోట్లు ఉండగా.. గూగుల్ పే లావాదేవీల సంఖ్య 559 కోట్లుగా ఉంది. ఇక పేటీఎం లావాదేవీల సంఖ్య ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకూ పెద్దగా మారింది లేదు. ఈ నేపథ్యంలో వాల్యూం పరంగా మార్కెట్ షేర్ లు ఫోన్ పే కి 48%, గూగుల్ పే కి 37.4%, పేటీఎం కు 7% గా ఉన్నాయి.