ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు... ఫోన్ పే సీఈవో కీలక ప్రశ్నలు!
ఈ నేపథ్యంలో... ఫోన్ పే సీఈవో, కో ఫౌండర్ సమీర్ నిగమ్ స్పందించారు. ఇందులో భాగంగా ఈ నిర్ణయన్ని ఆయన వ్యతిరేకించారు.
By: Tupaki Desk | 18 July 2024 1:38 PM GMTప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ఈ విషయం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రైవేటు కంపెనీల్లోని జాబ్స్ లో మెజారిటీ కన్నడిగులకే దక్కాలంటూ డాక్టర్ సరోజినీ మహిషీ గతంలో సమర్పించిన నివేదికను అమలుచేయాలని మంత్రివర్గ సమావేశంలో పలువురు ప్రస్థావించారు.
దీంతో... ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పైగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇదే విషయంపై ట్వీట్ కూడా చేశారు. దీంతో... అంతా కన్ ఫర్మేషన్ కి వచ్చేశారు! అయితే... పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ పే సీఈవో స్పందించారు.
అవును... ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపిందనే విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో... ఫోన్ పే సీఈవో, కో ఫౌండర్ సమీర్ నిగమ్ స్పందించారు. ఇందులో భాగంగా ఈ నిర్ణయన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు తెరపైకి తెస్తూ.. ప్రశ్నలు సంధించారు.
ఇందులో భాగంగా పేరెంట్స్ ఉద్యోగాల వల్ల వివిధ రాష్ట్రాలో చదువుకున్న విద్యార్థులు దీనివల్ల తీవ్రంగా నష్టపోతారని అన్నారు. తన తండ్రి ఇండియన్ నేవీలో పనిచేశారని.. ఆందువల్ల దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారని.. ఈ నేపథ్యంలో ఆయన పిల్లలకు కర్ణాటకలో ఉద్యోగం చేసే అర్హత లేదా అని నిగమ్ ప్రశ్నించారు. దీంతో... ఈ విషయం మరోసారి తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఇదే సమయంలో... తాను స్థాపించిన సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 25వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పిన ఆయన... ఉద్యోగరీత్యా తాను వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. అలాగని కర్ణాటకలో పుట్టి పెరిగిన తన పిల్లలు ఇక్కడ ఉద్యోగం చేసేందుకు అర్హులు కాదా అని సూటిగా ప్రశ్నించారు. తాను కూడా ఏ ఒక్క రాష్ట్రంలోనూ 15 ఏళ్లకు మించి నివసించలేదని తెలిపారు.
కాగా... కర్ణాటకలోని సంస్థల్లో పాలనా విభాగాల్లో 50శాతం, గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాల్లో 70శాతం ఉద్యోగాలను స్థానిక కన్నడిగులకే కేటాయించాలంటూ అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే... ఐటీ కంపెనీల్లో ఈ నిబంధనలను అమలుచేస్తే... నాణ్యతా ప్రమాణాలు లోపిస్తాయని, తమ ఆదాయాన్ని కోల్పోతామని ఆ సంస్థల ప్రతినిధులు విమర్శించారు.