Begin typing your search above and press return to search.

'చైనా కార్లకు కడుపొచ్చింది'... ఎక్స్ లో ట్యాగ్ వైరల్!

అవును... ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు ఇప్పుడు చైనాలో ఫుల్ హాట్ టాపిక్ గా మారాయి.

By:  Tupaki Desk   |   14 Aug 2024 7:05 AM GMT
చైనా కార్లకు కడుపొచ్చింది... ఎక్స్  లో ట్యాగ్  వైరల్!
X

కారు బ్యానెట్ ఎప్పుడు బల్లపరుపుగా ఉంటుందనేది తెలిసిన విషయమే. అలా ప్లేన్ గా ఉండాల్సిన కారు బ్యానెట్ లు బానపొట్టలా, నూనెలో వేసిన పూరిలా ఉబ్బి ఉన్నాయి. దీంతో బ్యానెట్ ఉబ్బిన కార్లను చూసి చైనాలో జనం షాకవుతున్నారు. వీటికి ఏమైంది? అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం "చైనా కార్లకు కడుపొచ్చింది" అనే ట్యాగ్ తో ఎక్స్ లో ఈ ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

అవును... ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు ఇప్పుడు చైనాలో ఫుల్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ కారు బ్యానెట్ ఎందుకు ఇలా ఉబ్బుతుందనే విషయం తీవ్ర చర్చనీయాంసం అయ్యింది. అలాగని ఇవేమీ గ్రాఫిక్స్ కాదు, తయారీలో లోపము అసలు కానే కాదు. పర్యావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇలా ఉబ్బిపోతున్నాయంట. ఈ విషయంలో ఆ కంపెనీ, ఈ కంపెనీ అనే తారమ్యాలేమీ లేవు!!

వాస్తవానికి కార్లపై పెయింట్ దెబ్బతినకుండా ఉండటానికి పైన వినైల్ ఫిల్మ్ ను అతికిస్తారు. కొంతమంది కారు లుక్ మరింత మెరుగవ్వడం కోసం వీటిని అతికిస్తే.. ఇంకొంతమంది యాడ్స్ కోసమూ వీటిని అతికిస్తుంటారు. అయితే తీవ్రమైన ఎండలో కారు ఎక్కువసేపు ఉంటే.. ఈ ఫిల్మ్ వెనుక అతికించిన రసాయనం వ్యాకోచం చెందుతుందంట. ఈ కారణంతోనే ఇలా ఉబ్బిపోయి ఉంటాయని అంటున్నారు.

పైగా ఈ సారి చైనాలోనూ ఎండలు మండిపోతున్నాయి. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయని చెబుతున్నారు. గత రెండుమూడు రోజులుగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో క్వాలిటీ ఫిల్మ్ ను వాడటంతో పాటు కార్లను ఎండల్లో ఎక్కువసేపు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చూపిస్తున్నారు. అలాకానిపక్షంలో కార్లకు కడుపు కన్ఫాం అనేది వారి మాటగా ఉంది!