Begin typing your search above and press return to search.

సీఏఏ పై సంచలన ప్రకటన చేసిన పీఐబీ!

దాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఖండించింది. యాంటీ ముస్లిం అంటూ అభివర్ణించింది. సీఏఏ చట్టం ముస్లింలకు ఎందుకు వ్యతిరేకం అని ప్రశ్నించింది.

By:  Tupaki Desk   |   12 March 2024 10:25 AM GMT
సీఏఏ పై సంచలన ప్రకటన చేసిన పీఐబీ!
X

సీఏఏ (ఉమ్మడి పౌరసత్వం యాక్ట్ ) బిల్లుపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని తెచ్చిన చట్టం కావడంతో సహజంగా విమర్శలు వస్తున్నాయి. బీజేపీ తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. దీనిపై ఆల్ జజీరా వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. దాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఖండించింది. యాంటీ ముస్లిం అంటూ అభివర్ణించింది. సీఏఏ చట్టం ముస్లింలకు ఎందుకు వ్యతిరేకం అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిర్ణయాలు సహేతుకం కాదని తెలియజేసింది.

సీఏఏ ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఎవరి పౌరసత్వానికి భంగం వాటిల్లదు. ఎవరి ప్రయోజనాలు కూడా కాలరాయదు. అఫ్గాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి వచ్చిన మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించింది చట్టం. దీనిపై అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇది ముమ్మాటికి ఎవరిని ఉద్దేశించింది కాదని స్పష్టం చేసింది.

సీఏఏ అమలుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏ మతానికి, వర్గానికి సంబంధించిన చట్టం కాదని బీజేపీ చెబుతున్నా వినిపించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం చేసిన పనికి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలియడం లేదు. ఈనేపథ్యంలో సీఏఏ అమలు వివాదాస్పదంలో పడుతోంది. దీని అమలుకు రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి.

సీఏఏ చట్టం అమలు పరచడంలో రాష్ట్రాలు మొగ్గు చూపడం లేదు. ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏ అమలు చేయమని తెగేసి చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సీఏఏ అమలు చేయమని స్పష్టం చేశారు. దీంతో సీఏఏ అమలు ప్రశ్నార్థకంగా మిగలడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఈనేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ వేసిన పాచికగా చెబుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి ఉద్దేశించిన పథకంలో భాగంగానే సీఏఏ తీసుకొచ్చిందని పలువురు చెబుతున్నారు. దీంతో సీఏఏ అమలు ఆచరణ సాధ్యం కాదని తెలుస్తోంది. సీఏఏ చట్టం బీజేపీ మెడకు చుట్టుకున్న మరో ఉచ్చుగానే అనుమానిస్తున్నారు.