Begin typing your search above and press return to search.

సొమ్మసిల్లి పడిపోయిన వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్!

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవల్స్ డౌన్ అవ్వడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు.

By:  Tupaki Desk   |   31 Jan 2025 11:18 AM GMT
సొమ్మసిల్లి పడిపోయిన వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్!
X

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవల్స్ డౌన్ అవ్వడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే గమనించిన పార్లమెంట్ సిబ్బంది హుటాహుటిన ఆయనకు ప్రాథమిక చికిత్స అందజేశారు. ఆ తరువాత రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రస్తుతం బోస్ ఆరోగ్యం కుదుటపడిందని, క్షేమంగా ఉన్నారని సుబ్బారెడ్డి వివరించారు.

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ రోజు ఉభయ సభల సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లారు బోస్. అయితే ఉదయం నుంచి ఆయన ఏమీ తినకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయి. దీంతో కళ్లు తిరిగి సృహ కోల్పోయారు. అయితే వెంటనే సిబ్బంది గుర్తించి వైద్యులకు సమాచారం చేరవేశారు. పార్లమెంట్ ఆవరణలోనే ఉన్న వైద్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ డౌన్ అవ్వడం వల్లే బోస్ సొమ్మసిల్లి పడినట్లు గుర్తించి అవసరమైన చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించారు. కాగా, 2022లో కూడా ఒకసారి బోస్ ఇదే విధమైన సమస్యకు లోనయ్యారు. అప్పుడు కూడా ఆయన షుగర్ లెవెల్స్ తగ్గిపోయి కళ్లు తిరిగి పడిపోయారు.