పినిపె వర్సెస్ సుభాష్.. పొలిటికల్ కాక..!
తన కుమారుడిని అరెస్టు చేయించింది సుభాషేనని విశ్వరూప్ అన్నారు.
By: Tupaki Desk | 22 Oct 2024 11:30 PM GMTవైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, టీడీపీ నాయకుడు, మంత్రి, రామచంద్ర పురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్‌ల మధ్య రాజకీయ వివాదాలు మరింత ముదిరాయి. తాజాగా పినిపే కుమారుడు డాక్టర్ శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేసిన దరిమిలా.. ఇరు పక్షాల మద్య రాజకీయ వివాదా లు పెరిగాయి. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. తన కుమారుడిని అరెస్టు చేయించింది సుభాషేనని విశ్వరూప్ అన్నారు.
ఆ అవసరం తనకు లేదని.. శ్రీకాంత్ ఆది నుంచి రౌడీలను ప్రోత్సహించారని.. వారే వలంటీర్ దుర్గా ప్రసాద్‌ను హత్య చేయించారని సుభాష్ ఎదురుదాడికి దిగారు. అయితే.. వాసంశెట్టికి అమలాపురంతో సం బంధం లేకపోయినా.. రాజకయంగా పినిపే కుటుంబంతో ఆయన విభేదిస్తున్నారు. పినిపే అధికారంలో ఉన్నప్పుడు.. టీడీపీని అణిచేసే కుట్ర చేశారన్న ఆవేదన వాసంశెట్టిలో ఉంది. ఇది సహజం కూడా. ఇప్పుడు విశ్వరూప్ కు ఇదే సమస్య ఎదురైంది.
పైగా పక్కా ఆధారాలతో ధర్మేష్ అనే యువకుడు చెప్పిన వాంగ్మూలం.. మరింతగా శ్రీకాంత్‌ను ఇరికించిం ది. అయితే.. ధర్మేష్‌కు టీడీపీతో సంబంధాలు ఉన్నాయన్నది విశ్వరూప్ వర్గం చెబుతున్న మాట. ఏదేమైనా.. ఇప్పుడు పినిపే శ్రీకాంత్ అరెస్టు అయ్యారు. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది చూడాలి. అయితే.. అటు దుర్గా ప్రసాద్, ఇటు పినిపేలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. పైగా పినిపే కుటుంబం దుర్గాప్రసాద్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఇచ్చిన హామీ వంటివి కేసుపై ప్రభావం చూపనున్నాయి.
కానీ, రాజకీయంగా మాత్రం.. ఈ వివాదం అనేక మలుపులు తిరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నా రు. పినిపే విశ్వరూప్ రాజకీయాల నుంచి తప్పుకొని తన వారసుడిగా శ్రీకాంత్‌ను ప్రొజెక్టు చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తనకు బదులు కుమారుడికిటికెట్ ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ, అది జరగే లేదు. వైసీపీ అధికారంంలోకి వచ్చి ఉంటే.. వేరేగా ఉండేది. కానీ, కూటమి రావడం.. కేసును తిరగదోడడం తో పినిపే శ్రీకాంత్ రాజకీయ భవిష్యత్తుపై అంచనాలు తలకిందులు అవుతున్నాయి. ఇదే రాజకీయంగా విశ్వరూప్‌కు ఇబ్బందిగా మారింది.