పిన్నెల్లి పై మరో కేసు... వీడియో వైరల్!
అవును... మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మ్రో కేసు నమోదయ్యింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టుకు హాజరుపరుస్తున్న సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి దాడి చేశారని ఓ వీడియో వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 28 Jun 2024 5:55 AM GMTమాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పోలింగ్ రోజు పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంట్ పై దాడి వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ ఆయన వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది. ఈ సమయంలో తాజాగా ఆయనపై మరో కేసు నమోదయ్యింది.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మ్రో కేసు నమోదయ్యింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టుకు హాజరుపరుస్తున్న సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి దాడి చేశారని ఓ వీడియో వైరల్ గా మారింది. దీంతో.. ఐపీసీ సెక్షన్ 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
కోర్టుకు హాజరవుతున్న సమయంలో వాహనం దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... వైసీపీ కార్యకర్తలతో కరచాలనం చేస్తున్నారు. ఈ సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శ శివ అక్కడే ఉండటంతో ఎదురుపడ్డారు! దీంతో పిన్నెల్లి... పిడికిలి బిగించి శివ కడుపులో బలంగా గుద్దినట్లు వీడియోలో కనిపిస్తుంది. దీంతో... బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో... ఇష్యూని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. మరోపక్క మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టు పిన్నెల్లికి రెండు కేసుల్లో 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు జడ్జి ఉత్తర్వ్యులు జారీ చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ పై దాడి, కారంపూడి సీఐ నారాయణస్వామిపై హత్యాయత్నం కేసుల్లో ఆయనకు రిమాండ్ విధించారు.
అన్న అరెస్ట్ వేళ తమ్ముడెక్కడ?:
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్, ఆపై జైలుకు తరలించడంతో ఇప్పుడు అందరి దృష్టి పరారీలో ఉన్న తమ్ముడు వెంకట్రామిరెడ్డిపై పడింది. పాల్వాయిగేటు ఈవీఎం మిషన్ ధ్వంసం కేసులో జూన్ 6 వరకూ పిన్నెల్లిపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని హైకోర్టు ముందస్తు ఉత్తర్వ్యులు జారీ చేసిన సమయంలో... గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కనిపించారు వెంకట్రామిరెడ్డి! అయితే నాటి నుంచీ ఆయన కనిపించడం లేదని అంటున్నారు!