పిఠాపురంలో మరోసారి కూటమిలో కుమ్ములాటలు.. వీడియో వైరల్!
అవును... టీడీపీ - జనసేన పార్టీల మధ్య పిఠాపురం వేదికగా మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.
By: Tupaki Desk | 1 Nov 2024 11:06 AM GMTఏపీలో ఉమ్మడిగా పొరాడి చారిత్రక విజయం దక్కించుకున్న కూటమిలోని టీడీపీ - జనసేన పార్టీల మధ్య కాలక్రమేణా విభేదాలు భగ్గుమంటున్నాయని అంటున్నారు. ఎన్నికల ముందు వరకూ ఒక రకంగా ప్రవర్తించిన వారు.. ఇప్పుడు మరో రకంగా నడుచుకుంటున్నరంటూ ఒకరినొకరు ఆరోపించుకుంటున్న పరిస్థితి. ఈ సమయంలో తాజాగా పిఠాపురంలో మరోసారి భగ్గుమన్నాయి.
అవును... టీడీపీ - జనసేన పార్టీల మధ్య పిఠాపురం వేదికగా మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఇప్పటికే గత నెలలో పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైట్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సమయంలోనూ విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. తాజాగా దెందులూరులోనూ పెన్షన్ కార్యక్రమంలో భాగంగా... ఇరు పార్టీల మధ్య తీవ్ర వేడి పరిస్థితులు తలెత్తాయి!
దీనిపై ఇప్పటికే దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్... జనసేన నేతలకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇదే సమయంలో తాజాగా పిఠాపురంలో మరోసారి టీడీపీ - జనసేనల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి!
ఇందులో భాగంగా... శుక్రవారం స్థానిక మున్సిపల్ కల్యాణ మండపంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అటు టీడీపీ నేతలు, కార్యకర్తలు.. ఇటు జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ ను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని స్థానిక నేతలు పిలుపునిచ్చారు. ఈ సమయంలో మైకందుకున్న జనసేన నేత కురుమళ్ల రాంబాబు కండువాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ కూటమి అభ్యర్థా? టీడీపీ అభ్యర్ధా? అని జనసేన నేత కురుమల్ల రాంబాబు ప్రశ్నించారు. ఎందుకంటే.. ఆయన మెడలో మూడు కండువాలు ఉన్నాయి కానీ.. ఆయనతో వచ్చిన ఎవరిలోనూ మూడు కండువాలు లేవన్నట్లుగా వ్యాఖ్యానించడంతో గొడవ మొదలైంది.
ఈ క్రమంలో ఆయన దగ్గర నుంచి మైకు తీసేసుకునే ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు! ఈ క్రమంలో కూటమి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఆ సమయంలో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ అక్కడే ఉన్నారు. కార్యకర్తలను వారించే ప్రయత్నం చేశారు