Begin typing your search above and press return to search.

పిఠాపురం వర్మను వైసీపీలోకి పంపిస్తున్నదెవరు ?

అయితే ఆమె వర్మ మీద విమర్శలు చేయడమే కాకుండా ఆయనను వైసీపీ నేతలకు టచ్ లో ఉన్నారని చెప్పడం మీద చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   30 March 2025 3:30 PM
పిఠాపురం వర్మను వైసీపీలోకి పంపిస్తున్నదెవరు ?
X

పిఠాపురంలో రాజా వారు ఆయన. ఇండిపెండెంట్ గా భారీ మెజారిటీతో గెలిచిన సత్తా ఉన్న నాయకుడు. అసలు నామధేయం ఎస్వీఎస్ఎన్ వర్మ. జనాలు పెట్టుకున్న పేరు పిఠాపురం వర్మ గారు. సామాజిక పరంగా చూస్తే పెద్దగా బలం లేదు. కానీ నూటికి అరవై శాతం ఒకే సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో జనాల మనసు గెలిచి జెండా పాతడం అంటే మామూలు విషయం కాదు. అందుకే పిఠాపురం వర్మ అంత స్పెషల్.

ఆయన రీసెంట్ గా పర్యటనలు చేస్తూంటే జనాలు మళ్ళీ మీరే పోటీ చేయండి అని కోరుతున్నారు అంటే ఆయన ముద్ర పిఠాపురం మీద ఎంత బలంగా ఉందో అర్ధం అవుతుంది. వర్మ బలం బలగం 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడానికి ఎంతగా కృషి చేశాయో కూడా అందరికీ తెలుసు.

అయితే ఏడాది నిండా నిండకముందే పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయం మారిపోయింది. గ్రౌండ్ లెవెల్ లో వర్మ పెత్తనం సహించమని జనసేన అంటూంటే బలంగా ఉన్న టీడీపీని ఎలా పక్కన పెట్టేస్తారు అన్నది వర్మ వర్గీయుల వాదనగా ఉంది.

ఈ నేపథ్యం నుంచి చూసినపుడు పిఠాపురం వర్మకు రెండు దఫాలుగా ఎమ్మెల్సీ పోస్ట్ దక్కలేదు ఏ కీలకమైన నామినేటెడ్ పదవీ కూడా దక్కలేదు. ఏ పదవీ లేకుండానే వర్మ పిఠాపురంలో కీలకంగా ఉన్నారు. అలాంటిది ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే మరో బలమైన అధికార కేంద్రంగా మారుతారు అన్నది జనసేనకు ఉందని అందుకే అడ్డుపడుతోంది అన్నది వర్మ అనుచరుల అభిమానుల భావన.

అయితే టీడీపీలో వర్మకు పదవి రాకపోవడానికి మాకూ సంబంధం ఏమిటి అన్నది జనసేన వాదన. దాని మీద మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చేశారు. వర్మకు పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది ఆ పార్టీ అంతర్గత విషయం అన్నారు. ఇపుడు చూస్తే ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేనలో చేరిన క్రాంతి అయితే ఏకంగా పిఠాపురం వర్మ మీద తీవ్ర విమర్శలు చేశారు.

ఆమె వర్మను వైసీపీలోకి వెళ్ళబోతున్న నాయకుడిగా కూడా ఆరోపించారు. వైసీపీ నేతలతో వర్మ టచ్ లో ఉన్నారని అందుకే ఆయనకు పదవులు ఏవీ దక్కడంలేదని కూడా అన్నారు. వర్మ చేస్తున్న చర్యలు అన్నీ వైసీపీకే ఎంతో ఉపయోగపడుతున్నాయని కూడా ఆమె అన్నారు. పైగా వర్మ ఏమి మాట్లాడినా వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తోందని అని కూడా అన్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో పవన్ తిరుగులేని నాయకుడి అని ఆమె అన్నారు. జనసేన అడ్డా పిఠాపురం అన్నది ఆమె మరో మారు అలా చెప్పారన్న మాట. అయితే ఆమె వర్మ మీద విమర్శలు చేయడమే కాకుండా ఆయనను వైసీపీ నేతలకు టచ్ లో ఉన్నారని చెప్పడం మీద చర్చ సాగుతోంది. నిజానికి వర్మ టీడీపీలో ఉన్నారు. అందులోనే కొనసాగుతారు అని అంటున్నారు.

ఆయనకు 2024 లో టికెట్ రానప్పుడే పార్టీ మారాలి కానీ ఆయన మారలేదు అంటే ఆయన టీడీపీకే కట్టుబడి ఉన్నారని చెబుతున్నారు. ఇక వెనక్కి వెళ్ళి చూస్తే 2009లో వర్మకు టీడీపీ టికెట్ ఇచ్చింది, 2014లో ఇవ్వలేదు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి మళ్ళీ టీడీపీలోనే ఉన్నారు అని గుర్తు చేస్తున్నారు.

ఆయన చంద్రబాబు లోకేష్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని అంటున్నారు. ఇక చూస్తే పదవులు రాకపోతే వర్మ వైసీపీలోకి వెళ్తారు అన్నది ఒట్టి పుకార్లు మాత్రమే అని అంటున్నారు వర్మ టీడీపీలో కొనసాగడం ఇష్టం లేని వారే ఈ తరహా ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. పొమ్మనకుండా పొగ పెడుతున్నారని అంటున్నారు. అయితే రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న వారు అయిన వర్మ ఈ తరహా వ్యూహాలను గమనిస్తారని ఆయన టీడీపీని వీడి ఎక్కడికీ పోరని ఆయన పట్ల పార్టీ అధినాయకత్వానికి కూడా ఎంతో గురి ఉందని చెబుతున్నారు.