Begin typing your search above and press return to search.

వైసీపీలోకి వర్మ...ఇందులో లాజిక్ ఉందా ?

వర్మకు టచ్ లోకి వైసీపీ నేతలు వచ్చారని ఆయన తొందరలోనే వైసీపీలోకి వెళ్తారని ఈ ప్రచారంగా ఉంది. అయితే వర్మ చాలా పరిణతి ఉన్న నాయకుడని అంటున్నారు.

By:  Tupaki Desk   |   11 March 2025 6:06 PM IST
వైసీపీలోకి వర్మ...ఇందులో లాజిక్ ఉందా ?
X

పిఠాపురం వర్మ ఇపుడు ఏపీలో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయిపోయారు. ఆయనలా ఇంతగా ఒక నియోజకవర్గం స్థాయి నేత రాష్ట్ర రాజకీయాలలో నలిగింది లేదు. దానికి కారణం పిఠాపురం అంటే వచ్చే పొలిటికల్ వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరో కాదు జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అందువల్ల పిఠాపురం నుంచి ఏ చిన్న మ్యాటర్ వచ్చినా అది బ్లాస్ట్ అవుతుంది.

ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 దాకా పిఠాపురానికి ఎమ్మెల్యేగా చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయనకు 2009లో టీడీపీ నుంచి తొలిసారి పోటీ చేస్తే 45,587 ఓట్లు దక్కాయి. ఇక 2014లో పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి 47,080 మెజారిటీని సాధించారు. 2019లో అయితే టీడీపీ టికెట్ మీద పోటీ చేసి ఓడినా 68,467 ఓట్లు తెచ్చుకున్నారు.

అలా వర్మ సొంత ఇమేజ్ ప్లస్ టీడీపీ క్యాడర్ అన్నీ కలసి ఆయనకు మంచి వోటింగ్ ని తెస్తూ ఉన్నాయి. అయితే 2024 లో మాత్రం వర్మ పోటీ చేయలేకపోయారు. వరుసగా మూడు ఎన్నికల్లో పోటీ చేసిన వర్మకు కూటమి పొత్తు జనసేన రూపంలో బ్రేక్ పడింది. ఇక చట్ట సభలోకి వర్మ ప్రవేశించి పదేళ్ళు అవుతోంది.

దాంతో ఆయన ఎమ్మెల్సీగా అయినా సభలోకి రావాలని అనుకున్నారు. పైగా ఆయనకు మంత్రి పదవి కూడా ఆఫర్ ఉందని ప్రచారం సాగింది. తీరా చూస్తే తాజాగా ఎమ్మెల్సీ సీట్ల ఎంపికలో వర్మకు మొండి చేయి దక్కింది. దానికి కారణం టీడీపీ పెద్దలకు వర్మ మీద అభిమానం ఉన్నా లోకల్ గా జనసేన నేతలతో వర్మకు గ్యాప్ ఉండంతో ఆయనకు సీటు ఇస్తే ఆ ఇంపాక్ట్ కూటమి బంధాల మీద పడుతుందని ఆలోచించి ఆగారని కూడా అంటున్నారు.

వర్మకు చూస్తే తనకు ప్రజా బలం ఉందని ధీమా ఉంది. అదే సమయంలో ఆయన అక్కడ కీలక నేతగా ఉన్నారని జనసేనకు ఉంది. జనసేనది సీటు అయినా హవా తమదే అన్నది వర్మ అనుచరుల మాటగా ఉంది. దీంతోనే విభేదాలు వస్తున్నాయి. ఇవి ముదరకుండా ఉండాలనే వర్మకు చాన్స్ ఇవ్వలేదని కూడా అంటున్నారు.

ఈ నేపథ్యం నుంచి చూసినపుడు రానున్న 2027 ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేసినపుడు ఇదే రకమైన పరిస్థితి రావచ్చు అని అంటున్నారు. ఎందుకంటే అప్పటికి ఇంకా ముదిరేవే తప్ప కుదిరేవి కావు ఈ గ్యాప్స్ అని అంటున్నారు. దాంతో పాటు పిఠాపురం జనసేన అడ్డా అని నాదెండ్ల మనోహర్ ప్రకటించేశాక వర్మ 2029 ఆశలు కూడా అవిరి అనే అంటున్నారు.

పవన్ కి ఈ సీటు సొంతంగా మారిందని ఆయనే పొత్తులలో భాగంగా పోటీ చేస్తారు అన్నది నిర్ధారణ అయినపుడు ఎగువసభకు అయినా పంపకుండా అసెంబ్లీకి చోటు దక్కకుండా ఉంటే వర్మ అండ్ కో కి ఉక్కబోత తప్ప మరేమి ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి వర్మ చంద్రబాబు లోకేష్ అని కీర్తిస్తున్నా తన రాజకీయానికి బ్రేకులు పడుతూంటే చూస్తూ ఊరుకుంటారా అన్నది కూడా చర్చగా ఉంది.

మరి ఎమ్మెల్సీ లేకపోతే ఎమ్మెల్యేగా అయినా చట్టసభలో కనిపించాలి. వర్మకు ఎమ్మెల్సీ దక్కకపోతే ఎమ్మెల్యేగా పోటీ అంటే కూటమి నుంచి చాన్స్ ఉండదు. అపుడు ప్రతిపక్షంలో వైసీపీయే మార్గం అని అంటున్నారు. బెస్ట్ ఆప్షన్ గా వైసీపీయే ఉందని అంటున్నారు. దీంతోనే ఇపుడు సోషల్ మీడియాలో ఇదే అంశం మీద పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

వర్మకు టచ్ లోకి వైసీపీ నేతలు వచ్చారని ఆయన తొందరలోనే వైసీపీలోకి వెళ్తారని ఈ ప్రచారంగా ఉంది. అయితే వర్మ చాలా పరిణతి ఉన్న నాయకుడని అంటున్నారు. ఆయన ఈ సమయంలో వైసీపీలోకి ఎందుకు వెళ్తారని అంటున్నారు. వెళ్ళి బావుకునేది ఏముందని అంటున్నారు. ఏపీలో కూటమి సర్కార్ చేతిలో నాలుగేళ్ళకు పైగా అధికారం ఉంది.

వర్మకు ఎమ్మెల్సీ పదవి లేదు కానీ టీడీపీ నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్నారు. అధికార పార్టీలో ఉంటూ హవా చాటుకోవడానికి ఈ పదవి చాలు. అంతే కాదు ఫ్యూచర్ లో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఉంది. దాంతో వర్మ తొందర పడరనే అంటున్నారు. ఇక 2027లో కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే అపుడు ఏమైనా వర్మలో మార్పు రావచ్చు ఆయన ఆలోచనలు మారవచ్చు అని అంటున్నారు.

ఎందుకంటే అప్పటికి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడతాయి కాబట్టి ఏదో కీలక నిర్ణయం తీసుకోవచ్చు అని అంటున్నారు. అందువల్ల ఈ ప్రచారంలో ఇపుడు లాజిక్ ఉందా అంటే లేదనే అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఎపుడు ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ తరహా ప్రచారాలు వస్తూనే ఉంటాయని అంటున్నారు.