పిఠాపురంలో ఎంతమంది ఎన్ని నామినేషన్స్ వేశారో తెలుసా?
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీల్లో అత్యంత హాట్ టాపిక్ నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 April 2024 5:49 AM GMT2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీల్లో అత్యంత హాట్ టాపిక్ నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటనే సంగతి తెలిసిందే. కేవలం ఏపీలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నియోజకవర్గంలోని గెలుపోటములపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గం ఇంత హాట్ టాపిక్ గా మారడానికి గల కారణం.. ఇక్కడ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటమే అనేది తెలిసిన విషయమే.
గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచిన నేపథ్యంలో... ఇక్కడ జనసేనకు ఈ ఎన్నికల్లో ప్రతీ ఓటూ కీలకం కాగా... అదే ఎన్నికల్లో టీడీపీ - జనసేనలకు కలిపి లక్షపైగా ఓట్లు వచ్చిన నేపథ్యంలో... వైసీపీ కూడా ప్రతీ ఓటు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థుల నుంచి 19 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు!
ఇందులో కొంతమంది అభ్యర్థులు రెండేసి నామినేషన్లు వేయగా.. పవన్ కల్యాణ్ తరుపున నాలుగు నామినేషన్లు వేసినట్లు చెబుతున్నారు! ఇదే సమయంలో... వంగ గీతతో పాటు ఆయన భర్త వంగ కాశీ విశ్వనాథ్ కూడా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు! అయితే చివరి నిమిషంలో ఆయన విత్ డ్రా అవ్వడం కన్ ఫాం అయిన నేపథ్యంలో... మిగిలిన పదిమంది అభ్యర్థుల నామినేషన్లూ ఆమోదించబడితే... పిఠాపురంలో పదిమంది పోటీ పడుతున్నట్లు ఫిక్సవ్వొచ్చు!
ఈ క్రమంలో పిఠాపురంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు ఇప్పుడు చూద్దాం...!
వంగ గీత విశ్వనాథ్ - వైఎస్సార్సీపీ
సత్యానంద రావు - కాంగ్రెస్
కే పవన్ కల్యాణ్ - జనసేన
వంగ కాశీ విశ్వనాథ్ - వైఎస్సార్సీపీ
జే మల్లికార్జున - జై భీం రావ్ భారత్ పార్టీ
తమన్నా సింహాద్రి - భారత చైతన్య యువజన పార్టీ
మద్దూరి వీరబాబు – పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా
మొగ్గలి లక్షణమూర్తి - ఇండిపెండెంట్
బొలిశెట్టి గౌరీమణి - ఇండిపెండెంట్
పి వీర ప్రభాకర్ రావు - ఇండిపెండెంట్
ఇ జగదీష్ - ఇండిపెండెంట్