పీకే క్రెడిట్ కొట్టేస్తాడా.. ఎల్లో మీడియాకి బిగ్ ట్రబుల్...!?
తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తలు అసలు అవసరమా అంటే లేదు అని చెప్పడానికి ఎల్లో మీడియా ఎపుడూ ఆ పక్కనే ఉంటుంది. ఎల్లో మీడియా గ్రౌండ్ లెవెల్ లో డైలీ ఉంటుంది.
By: Tupaki Desk | 24 Dec 2023 12:30 PM GMTతెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తలు అసలు అవసరమా అంటే లేదు అని చెప్పడానికి ఎల్లో మీడియా ఎపుడూ ఆ పక్కనే ఉంటుంది. ఎల్లో మీడియా గ్రౌండ్ లెవెల్ లో డైలీ ఉంటుంది. తమ నెట్ వర్క్ ని అంతటా విస్తరించి ఎప్పటికపుడు ఫ్రెష్ మ్యాటర్ ని తెచ్చి టీడీపీతో పంచుకుంటుంది. ఇక ఎల్లో మీడియా అపర చాణక్యుడు మాదిరిగానే ఫీల్ అవుతుంది.
టీడీపీకి ఆస్థాన సలహాదారుగా కూడా ఉంటుంది. టీడీపీ ఏమి మాట్లాడాలి, ఎక్కడ సభ పెట్టాలి, ఎన్నికల్లో ఏ హామీ ఇవ్వాలి చంద్రబాబు చినబాబు అడుగులు ఎలా పడాలి అంతా కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ వస్తోంది ఎల్లో మీడియా. మరో వైపు అధికార వైసీపీని బాగా పలుచన చేయడమే కాదు అక్కడ లో గుట్టు తెచ్చి టీడీపీకి ఇవ్వడం అధికార పార్టీని బదనాం చేయడంతో ఎల్లో మీడియా పోషించే పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది.
మొత్తంగా చూస్తే ఎల్లో మీడియా వేయి కళ్లతో టీడీపీని చూసుకుంటూ వస్తోంది. టీడీపీ విజయం తన విజయంగా భావిస్తూ త్రికరణ శుద్ధిగా మూడు వందల అరవై అయిదు రోజులూ పనిచేసే ఎల్లో మీడియా అండదండలు ఉండగా టీడీపీకి మరో వ్యూహకర్త అవసరమా అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న.
ఇక ఈ రోజు దాకా తాము చెప్పిందే మాట, తాము తలచిందే బాట అన్నట్లుగా టీడీపీ వద్ద ఎల్లో మీడియా పరపతి పెద్ద ఎత్తున వెలిగిపోతూ వచ్చింది. అలాంటిది ఇపుడు పీకే అనబడే ప్రశాంత్ కిశోర్ టీడీపీతో కలవడం ఒక విధంగా ఎల్లో మీడియాకు కంటగింపుగానే ఉంది అని అంటున్నారు. గడచిన నాలుగైదేళ్ళుగా తామే టీడీపీని అన్ని విధాలుగా చేయి పట్టి నడిపిస్తూ వచ్చామని అలాంటిది ఇపుడు పీకే ఎంట్రీ ఇచ్చి ఉద్ధరించేది ఏంటి అన్నదే ఎల్లో మీడియా బాధ ఆవేదన అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే ఏపీలో యాంటీ ఇంకెంబెన్సీ ఉంది. దాన్ని క్రియేట్ చేయడంతో తామే ముఖ్య పాత్ర పోషించామని ఎల్లో మీడియా చెప్పుకుంటోంది. రేపటి రోజున ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆ క్రెడిట్ ఆలిండియా లెవెల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేకే వస్తుంది అన్న కలవరం కూడా ఎల్లో మీడియా పెద్దలకు ఉంది అని అంటున్నారు.
కేవలం మూడంటే మూడు నెలలు మాత్రమే ఎన్నికలకు వ్యవధి ఉన్న వేళ పీకే ఏమి చేసినా అది క్లైమాక్స్ ఫైటే తప్ప మరేమీ ఉండదని ఎల్లో మీడియా నుంచి భావనగా ఉంది.అంటే చేయాల్సింది అంతా తాము చేశామని పడాల్సిన కష్టాలు నిష్టూరాలూ అన్నీ తాము పడ్డామని ఇపుడు క్లైమాక్స్ లో పీకే వచ్చి మొత్తం అంతా తనదే అని క్రెడిట్ పట్టుకుని పోతే తాము చూస్తూ ఊరుకోవడమేనా అన్నదే ఎల్లో మీడియా బెంగగా ఉందిట.
ఏది ఏమైనా ఒకే ఒక్క పీకే ఎల్లో మీడియాకి గుబుల్ రేపేలా ఉన్నారని అంటున్నారు. ఇక ఇదే పీకే మీద పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసి మరీ చేతులు నొప్పెట్టించుకున్న ఎల్లో మీడియాకు ఆయన టీడీపీకి క్లోజ్ కావడం మాత్రం ఏ కోశానా మింగుడు పడడంలేదు అని అంటున్నారు.
టోటల్ గా చెప్పాల్సింది ఒక్కటే ఒక్కటి. పీకే వచ్చి పీకేది ఏదీ లేదని, తామే అంతా చేసి పెడితే సక్సెస్ కార్డుని తన మెడకు తగిలించుకోవడమే తప్ప ఏముందని కూడా పెదవి విరుపులు అయితే ఎల్లో మీడియా శిబిరం నుంచి వస్తున్నాయట. ఒక విధంగా చూస్తే ఫుల్ జెలసీ కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది అంటున్నారు.