Begin typing your search above and press return to search.

షాకింగ్ వీడియో: కుప్పకూలిన విమానం.. 72 మంది మృతి!

ఈ ప్రమాదంలో 72 మంది మృతి చెందినట్లు చెబుతుండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2024 9:18 AM GMT
షాకింగ్  వీడియో: కుప్పకూలిన విమానం.. 72 మంది మృతి!
X

కజకిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. అక్టౌ నగరానికి సమీపంలో అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో సిబ్బందితో పాటు మొత్తం 110 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 72 మంది మృతి చెందినట్లు చెబుతుండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారని అంటున్నారు.

అవును... కజకిస్తాన్ లోని అక్టౌ నగరానికి సమీపంలో ప్రయాణికుల విమానం కూలిపోయింది. దీంతో.. సుమారు 72 మంది మరణించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖ ఈ విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అజర్ బైజాన్ లోని బాకు నుంచి బయలుదేరిన విమానం రష్యా రిపబ్లిక్ చెచెన్యా రాజధాని గ్రోజ్ఞీ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. అయితే.. గ్రోజ్ఞీలోని దట్టమైన మంచు కారణంగా ఆ విమానాన్ని దారి మల్లించగా.. అక్టౌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కూలిపోయినట్లు చెబుతున్నారు.

అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ ఎంబ్రేయర్ - 190 ఫ్లైట్ నెంబర్ 8243 విమానం కజఖ్ నగరమైన అక్టౌ నుంచి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని.. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగిందని.. అయితే ఘటనకు గల కారణాలను తెలుసుకుంటామని కజకిస్తాన్ అధికారులు చెబుతున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో విమాన ప్రమాదం తర్వాత భారీగా చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారని.. ఈ సమయంలో ప్రాణాలతో బయటపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారని.. వారందరికీ చికిత్స అందిస్తున్నారని కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖ వెళ్లడించింది.