Begin typing your search above and press return to search.

పారాహుషార్.. లీటరు బాటిల్ నీళ్లలో 2.4లక్షల ప్లాస్టిక్ రేణువులు

ఒక లీటర్ వాటర్ బాటిల్ లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్న షాకింగ్ వాస్తవం వెలుగు చూసినట్లుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 8:30 AM GMT
పారాహుషార్.. లీటరు బాటిల్ నీళ్లలో 2.4లక్షల ప్లాస్టిక్ రేణువులు
X

నీళ్లు తాగాల్సిన ప్రతి సందర్భంలో ముందు వెనుకా చూసుకోకుండా.. ఆ మాటకు వస్తే మరో ఆలోచన వాడేసే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు సంబంధించిన భయంకర నిజం ఒకటి బయటకు వచ్చింది. ఒక లీటర్ వాటర్ బాటిల్ లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్న షాకింగ్ వాస్తవం వెలుగు చూసినట్లుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటివరకు అంచనా వేసిన దానితో పోలిస్తే ఇది 100 రెట్లు ఎక్కువన్న విషయంతో పాటు.. ఇది మనుషుల ఆరోగ్యంపై అత్యంత తీవ్ర ప్రభావాన్నిచూపించే అంశంగా సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు.

తాజాగా పబ్లిష్ అయిన ‘ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్ లో ఈ రీసెర్చ్ వివరాల్ని వెల్లడించారు. తమ పరిశోధనలో భాగంగా.. అమెరికాలోని మూడు ప్రముఖ కంపెనీలకు చెందిన 26 వన్ లీటర్ బాటిల్ నీళ్లలో నానో ప్లాస్టిక్స్ అవశేషాలపై అధ్యయనం చేయగా.. మనిషి వెంట్రుక మందంలో 70వ వంతు ఉండే తక్కువ పొడవు ఉన్న ప్లాస్టిక్ కణాలు పెద్ద ఎత్తున ఉన్నట్లుగా గుర్తించారు. ఇవి అత్యంత సూక్ష్మంగా ఉండటం వల్ల మనిషి కణాల్లోకి.. రక్తంలోకి.. ముఖ్యమైన అవయువాల్లోకి సులువుగా ప్రవేశిస్తాయని గుర్తించారు.

చివరకు ఇవి గర్భంలో ఉన్న శిశువుల్లోకి వెళ్లి.. తమ ప్రభావాన్ని చూపిస్తాయని గుర్తించారు. ప్లాస్టిక్ బాటిల్ నీళ్లలో నానో ప్లాస్టిక్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు చాలాకాలంగా అనుమానిస్తున్నా.. వాటిని గుర్తించే సాంకేతికత అందుబాటులోకి రాలేదు. ఇదిలా ఉండగా.. అమెరికాలోని కొలంబియా వర్సిటీకి చెందిన నైక్సిన్ క్వియన్ సారథ్యంలోని రీసెర్చ్ టీం.. డేటా ఆధారిత ఆల్గరిథమ్ ను ఉపయోగించి ఒక కొత్త మైక్రోస్కోపీ టెక్నిక్ ను డెవలప్ చేశారు. దీని ద్వారా.. మూడు ప్రముఖ కంపెనీల నీళ్ల బాటిళ్ల మీద పరిశోధన చేయగా.. ఈ ప్రమాదకర అంశం వెలుగు చూసింది. అయితే.. ఆ మూడు ప్రముఖ బ్రాండ్లు ఏమిటన్న విషయాన్ని వెల్లడించకపోవటం గమనార్హం.