నిరుద్యోగులతో ఈ రాష్ట్రాలు కిటకిట... తెలుగు స్టేట్ కి స్థానం!
తాజాగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీ.ఎల్.ఎఫ్.ఎస్.) అందించిన నివేదిక కీలక విషయాలు వెల్లడించింది.
By: Tupaki Desk | 6 Dec 2024 2:30 AM GMTప్రపంచంలోని అనేక దేశాలను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి నిరుదోగ్యం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తాజాగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీ.ఎల్.ఎఫ్.ఎస్.) అందించిన నివేదిక కీలక విషయాలు వెల్లడించింది.
అవును... ప్రపంచంలోని చాలా దేశాలతో పాటు భారత్ కూడా నిరుద్యోగ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వివిధ రంగాల్లో ఆకట్టుకునే వృద్ధి కనబరుస్తున్నప్పటికీ.. దేశంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం భయంకరమైన స్థాయిలో నిరుద్యోగాన్ని ఎదుర్కోంటున్నాయని తాజా సర్వే పేర్కొంది. అవి ఏమేమిటి అనేది ఇప్పుడు చూద్దాం...!
లక్షద్వీప్ - 11.1%
భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 11.1%తో లక్షద్వీప్ అగ్రస్థానంలో ఉంది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో జనాభా తక్కువగా ఉన్నప్పటికీ.. ఎక్కువమంది ప్రజలు పర్యాటకంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో... నిరుద్యోగ సమస్యలు పెరుగుతున్నాయని అంటున్నారు.
గోవా - 9.7%
లక్షద్వీప్ లాగానే గోవా కూడా భారతదేశంలో ప్రధాన పర్యాటక కేంద్రం. అయినప్పటికీ ఇక్కడ ఉపాధి లోటు తో పాటు పారిశ్రామిక వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉండటానికి కారణంగా చెబుతున్నారు.
అండమాన్ & నికోబార్ దీవులు - 9.7%
ఈ కేంద్రపాలిత ప్రాంతం కూడా నిరుద్యోగిత రేటు విషయంలో గోవాతో పోటీ పడుతుంది. సుమారు నాలుగు లక్షల జనాభా కలిగి ఉన్న ఈ ప్రాంతంలో.. యువత ఎక్కువగా ప్రభుత్వ రంగ ఉద్యోగాలపైనే ఆధారపడి ఉంటారని అంటారు. వాటి కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారని చెబుతుంటారు. ఈ క్రమంలో నిరుద్యోగం పెరుగుతుందని అంటున్నారు!
నాగాలాండ్ - 9.1%
జాబితాలో తదుపరి స్థానంలో ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ ఉంది. గతంలో కంటే కాస్త మెరుగుదల కనిపించినప్పటికీ.. ఇప్పటికీ నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉంది. ఇక్కడ మౌలిక సదుపాయాల కొరత ఎక్కువగా ఉండటంతో.. ఉపాధి విధానాలను సులభతరం చేసేందుకు సహాయపడే ప్రైవేటు రంగ పెట్టుబడి లేదని అంటున్నారు.
కేరళ - 7.0%
భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత రేటు, బలమైన మానవాభివృద్ధి సూచికలు ఉన్నప్పటికీ.. కేరళను నిరుద్యోగ సమస్య వేధిస్తుందని అంటున్నారు. విద్యావంతులైన యువత ఎక్కువగా ఉండటం దీనికి ఒక కారణం అయినప్పటికీ.. ఇక్కడ నిరుద్యోగమే ప్రధాన సవాళ్లలో ఒకటని అంటున్నారు.
హర్యానా - 6.1%
వాస్తవానికి ఉత్తర భారతంలో ఈ రాష్ట్రం పారిశ్రామిక కేంద్రంగా ఉన్నప్పటికీ.. పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా ఉద్యోగ కల్పన జరగలేదని అంటున్నారు. పెరుగుతున్న జనాభా కూడా రాష్ట్రంలో నిరుద్యోగం పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు.
చండీగఢ్ - 6.0%
చండీగడ్ ప్రాంతం నిరుద్యోగ రేటును ఎదుర్కోటోంది. ప్రభుత్వ, సెవా రంగాల్లో ఎక్కువగా కేంద్రీకృతమైనప్పటికీ.. పరిమిత అవకాశాలు రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాల విషయంలో భారీ అంతరాన్ని సృష్టిస్తున్నాయి.
మేఘాలయ - 6.0%
మేఘాలయ నిర్ద్యోగిత రేటు చంఢీగఢ్ తో సమానంగా ఉంది. ఇక్కడ ఏమాత్రం సరిపోని పారిశ్రామిక అభివృద్ధి, పరిమిత ఉపాధి అవకాశాలు ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. ఇక్కడ నివాసితులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని అంటున్నారు.
జమ్మూ & కశ్మీర్ - 4.4%
ఇక్కడ ప్రధానంగా అనేక రాజకీయ సవాళ్లు యువతను వేధిస్తున్నాయని అంటారు. దీనికి తోడు అస్థిరత, స్థానిక వ్యాపారాలకు మార్కెట్ లకు పరిమిత అవకాశాల కారణంగా ఇక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
తెలంగాణ - 4.4%
4.4% నిరుద్యోగిత రేటుతో ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఈ రాష్ట్ర రాజధాని హైదరబాద్ ఐటీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ యువతకు ఉద్యోగ కల్పన లేదని.. పైగా ఉద్యోగాలను పొందేందుకు గ్రామీణ యువత సరైన విద్య కోసం పోరాడుతున్నారని అంటున్నారు.