Begin typing your search above and press return to search.

హీటెక్కిన పాలిటిక్స్ : ఢిల్లీలో మోడీ...బెంగుళూరుకు సోనియా !

దేశంలో రెండు బలమైన కూటములు తమ మిత్రులతో కలసి 2024 ఎన్నికల మీద సుదీర్ఘ సమాలోచనలకు తెర లేపనున్నాయి.

By:  Tupaki Desk   |   16 July 2023 8:33 AM GMT
హీటెక్కిన పాలిటిక్స్ : ఢిల్లీలో మోడీ...బెంగుళూరుకు సోనియా !
X

దేశంలో రెండు బలమైన కూటములు తమ మిత్రులతో కలసి 2024 ఎన్నికల మీద సుదీర్ఘ సమాలోచనలకు తెర లేపనున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే కూటమి 2014 వరకూ దేశాన్ని ఏలింది. ఆ తరువాత మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పేరుకు ఎన్డీయే అని అంటున్నా అది పూర్తిగా బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. కాబట్టి ఆ పార్టీ ఆలోచనలే అమలు అవుతున్నాయి.

అయితే ఎన్డీయే మిత్రులకు కొన్ని కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా కూటమి ఉందని చెప్పుకుంటున్నారు. మరో వైపు చూస్తే 2014 తరువాత ఎన్డీయే మిత్రులతో మోడీ మీట్ అయింది లేదు. ఇది చాలా సుదీర్ఘమైన కాలం అని చెప్పాలి. మళ్ళీ తొమ్మిదేళ్ళ తరువాత 2024 ఎన్నికల కోసం అన్నట్లుగా మిత్రులు గుర్తుకు వచ్చి బీజేపీ వారితో భేటీ అవుతోంది. ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీయే మిత్రులతో కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ భేటీకి దేశంలోని బీజేపీ మిత్రులు ఇరవై పార్టీల దాకా హాజరవుతాయని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జనసేనకు మాత్రమే ఎన్డీయే మీటింగ్ కోసం ఆహ్వానం వచ్చింది. ఎన్డీయే మాజీ మిత్రపక్షం టీడీపీని పిలవలేదు, వైసీపీ ఎన్డీయే దోస్తీ కానే కాదు కాబట్టి ఆ పేచీయే లేదు. అయితే తెలుగుదేశానికి చివరి నిముషంలో అయినా పిలుపు వస్తుందా అన్నదే ఇంకా తేలని విషయం.

ఇదిలా ఉంటే గత నెలలో అమిత్ షాతో చంద్రబాబు కీలక భేటీ జరిగింది. దాన్ని తెలుగు మీడియా చాలా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. ఇంకేముందు పొత్తులు కుదిరినట్లే అన్నట్లుగా వార్తా కధనాలు వచ్చాయి. కానీ అలా ఏమీ అనుకున్నట్లుగా సాగలేదు. ఆ భేటీలో ఎవరేమి మాట్లాడారు అన్నది కూడా బయటకు రాలేదు. బహుశా ఆ మీటింగులో తేలాల్సిన విషయాలు కొన్ని ఉన్నందు వల్లనే టీడీపీతో బీజేపీ బంధం మళ్ళీ పెనవేసుకోకుండా ఆగింది అని అంటున్నారు.

ఇక జనసేన తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక పార్టీగా వెళ్లడం ద్వారా పొలిటికల్ గా స్టార్ స్టేటస్ దక్కించుకుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ నెల 18న ఎన్డీయే మీటింగ్ ఉంది. నరేంద్ర మోడీ అమిత్ షా, జేపీ నడ్డా బీజేపీ అగ్ర నాయకత్వం అంతా ఈ భేటీలో పాలుపంచుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో కలసికట్టుగా ఎలా ముందుకు సాగాలన్న దాని మీదనే ఈ భేటీని నిర్వహిస్తున్నారు అని అంటున్నారు.

అదే సమయంలో ఎన్డీయే పాత పార్టీలను, తటస్థ పార్టీలను కూడా చేర్చుకునే విషయం కూడా ఈ భేటీలో చర్చిస్తారని అంటున్నారు. అదే జరిగితే తెలుగుదేశానికి కూడా చోటు ఉంటుందని అంటున్నారు. ఇక ఈ నెల 17, 18 తేదీలలో బెంగుళూరు వేదికగా విపక్ష కూటమి కీలక భేటీ ఉంది. రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీకి కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ హాజరవుతున్నారు. దీనికి ముందు పాట్నాలో జరిగిన మీటింగ్ కి రాహుల్ గాంధీ హాజరైతే ఈసారి సోనియావే రావడంతో ఈ మీటింగ్ ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఇంకో వైపు చూస్తే పాట్నా మీటింగ్ కి పదహారు పార్టీలు హాజరైతే ఈసారి ఆ సంఖ్య 23 కి పెరుగుతోందని అంటున్నారు. అలా బలమైన విపక్ష కూటమికి బెంగుళూరు మీటింగ్ వేదికగా మారుతోంది అని అంటున్నారు. అటు మోడీ ఢిల్లీలో ఇటు సోనియా గాంధీ బెంగుళూరులో ఒకే డేట్ లో జరిపే కూటమి సమావేశాలు వ్యూహాలతో జాతీయ రాజకీయ ఒక్కసారిగా వేడెక్కనుంది.

అద్నే టైంలో దేశంలో రెండు బలమైన జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ నాయకత్వంలో అటూ ఇటూ ఇతర పార్టీలను కూడగట్టి 2024 సమరానికి మోహరించే ప్రయత్నం అయితే గట్టిగానే సాగుతొంది. ఎన్డీయే వైపు ఇరవై పార్టీలు ఉంటే విపఖ కూటమి వైపు 23 ఉన్నాయని అంటున్నారు. మరి తటస్థంగా ఉన్న పార్టీలుగా ఇప్పటికైతే బీయారెస్, వైసీపీ, టీడీపీ బెజేడీ వంటివి ఉన్నాయి.

అంటే రెండు తెలుగు రాష్ట్రాలే జాతీయ రాజకీయాల్లో తాము ఎటూ అన్నది తేల్చుకోలేకుండా ఉన్నానా అన్నది చర్చకు వస్తోంది. ఇక బీజేడీ అయితే ఎపుడూ న్యూట్రల్ గానే ఉంటుంది కాబట్టి బాధ లేదు. టీడీపీ బీయారెస్ లోక్ సభ ఎన్నికల నాటికి తమ విధానాలు ప్రకటించే చాన్స్ ఉంది. ఆ లెక్కన తీసుకుంటే తెలుగు రాష్ట్రాలలో వైసీపీ మాత్రమే న్యూట్రల్ గా ఉంటుందని అంటున్నారు.