Begin typing your search above and press return to search.

రష్యా చరిత్రలోనే అత్యంత కీలకమైన రోజున మోదీ పర్యటన..?

ఉక్రెయిన్ లో జెలెన్ స్కీని కూడా ఆలింగనం చేసుకుని తమది యుద్ధంలో తటస్థ పక్షం కాదని శాంతి పక్షం అని కొత్త నినాదం ఇచ్చారు.

By:  Tupaki Desk   |   26 Feb 2025 11:30 AM GMT
రష్యా చరిత్రలోనే అత్యంత కీలకమైన రోజున మోదీ పర్యటన..?
X

గత ఏడాది ఎన్నికల్లో గెలిచిన వెంటనే భారత ప్రధాని మోదీ చేసిన తొలి ప్రధాన పర్యటన ఏమిటో తెలుసా..? అప్పటికే రెండేళ్లుగా యుద్ధంలో మునిగి.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాకు వెళ్లారు మోదీ. ఇదే అందరినీ అందరినీ ఆశ్చర్యపరిచింది అనుకుంటుండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఆలింగనం చేసుకున్నారు మోదీ. దీంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అయితే మోదీని తీవ్రంగా తప్పుబట్టారు. నష్ట నివారణ చర్యగా ఆ వెంటనే ఉక్రెయిన్ లోనూ పర్యటించారు.

ఉక్రెయిన్ లో జెలెన్ స్కీని కూడా ఆలింగనం చేసుకుని తమది యుద్ధంలో తటస్థ పక్షం కాదని శాంతి పక్షం అని కొత్త నినాదం ఇచ్చారు. భారత్ కు రావాల్సిందిగా జెలెన్ స్కీని ఆహ్వానించారు. అంతటితో కథ ముగిసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్ రష్యా వైపు కాస్త మొగ్గుచూపుతోంది అన్న విమర్శలకు చెక్ పడింది.

గత ఏడాది జూలైలో మాస్కోలో పర్యటించిన మోదీ మరోసారి రష్యాకు వెళ్లనున్నారట. అది కూడా వచ్చే మే 9న రష్యాలో పర్యటిస్తారని తెలుస్తోంది. అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో అమెరికా వైఖరి మారుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ పూర్తిగా పుతిన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రమేయం లేకుండానే సౌదీలో రష్యాతో చర్చలు సాగించారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ రష్యా టూర్ పెట్టుకున్నారు.

మోదీ మే 9న రష్యాకు వెళ్లనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆ రోజు రష్యా చరిత్రలో అత్యంత కీలకమైనది. ఇది వారి ‘‘విక్టరీ డే’’. నియంత హిట్లర్ సారథ్యంలోని జర్మనీపై రెండో ప్రపంచ యుద్ధంలో అప్పటి సోవియట్ సోషలిస్ట్ యూనియన్ రష్యా (యూఎస్ఎస్ఆర్) సాధించిన విజయానికి గుర్తుగా మే 9ని విక్టరీ డే జరపుకొంటుంటారు.

1945 మే 9 నుంచి ‘విక్టరీ డే’ జరుపుకొంటున్నారు. ఈసారి 80వ విక్టరీ డే అన్నమాట. ఈ చరిత్రక సందర్భంలో మోదీ రష్యాలో పర్యటించనున్నారు.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి ఇప్పటికే మూడేళ్లు పూర్తయ్యాయి. మరో నెలన్నరలో జరిగే మోదీ టూర్ తో అయినా ఇది ఒక కొలిక్కి వస్తుందేమో?