Begin typing your search above and press return to search.

ప్రధాని కోసం విమానం దారిమళ్లింపు.. అసలుకారణం ఇదే!

సాధారణంగా దేశ ప్రధానులు ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణిస్తుంటారు! వారి సెక్యూరిటీ రీత్యా, హోదా రీత్యా దాదాపు అన్ని దేశాలూ ఇలానే ప్లాన్ చేస్తాయి

By:  Tupaki Desk   |   11 April 2024 5:18 AM GMT
ప్రధాని కోసం విమానం దారిమళ్లింపు.. అసలుకారణం ఇదే!
X

సాధారణంగా దేశ ప్రధానులు ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణిస్తుంటారు! వారి సెక్యూరిటీ రీత్యా, హోదా రీత్యా దాదాపు అన్ని దేశాలూ ఇలానే ప్లాన్ చేస్తాయి. అయితే... ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ లో మాత్రం ప్రధాని కూడా అందరూ ప్రయాణించే విమానంలోనే విదేశీ పర్యటనలు చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ఈ ప్రధాని పుణ్యమాని వందల మంది ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తోంది.

అవును... ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదనే సంగతి తెలిసిందే. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు అకాశానికి అందుకున్నాయి. కోడి గుడ్డు నుంచి పెట్రోల్, డీజిల్ వరకూ అమృతంలా మారిపోయాయని అంటున్నారు. ఈ రేంజ్ లో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పాకిస్థాన్ సర్కార్.. ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు జీతాలు కూడా తీసుకోమని చెప్పారు.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా సామాన్య ప్రయాణికుల విమానంలోనే ప్రయానిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా.. ఆయన కోసం విమానాన్ని దారి మళ్లించారు. ఇందులో బ్భాగంగా... ప్రధాని దిగడం కోసం ఇస్లామాబాద్‌ వెళ్లాల్సిన విమానాన్ని లాహోర్‌ వైపు దారి మళ్లించారట!

పాక్ మీడియా కథనాల ప్రకారం... "జెడ్డా నుంచి ఇస్లామాబాద్‌ వెళ్లే విమానంలో ప్రధాని, ఆయన బృందంతో పాటు మొత్తం 393 మంది ప్రయాణికులున్నారు. వాస్తవానికి ఈ విమానం రాత్రి 10:30 గంటలకు ఇస్లామాబాద్‌ లో దిగాల్సి ఉండగా.. దారి మళ్లించడంతో రాత్రి 9:25 గంటలకే విమానం లాహోర్‌ విమానాశ్రయంలో దిగింది. అనంతరం రాత్రి 11:17 గంటలకు విమానం అసలైన గమ్యస్థానానికి చేరుకుంది"!