చెవిరెడ్డిపై పోక్సో కేసు... బాలిక తండ్రి సంచలన ఆరోపణలు!
వైసీపీలో జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కోటరీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది ప్రత్యేక స్థానం అని చెబుతుంటారు.
By: Tupaki Desk | 26 Nov 2024 9:22 AM GMTవైసీపీలో జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కోటరీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది ప్రత్యేక స్థానం అని చెబుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా జగన్ వద్ద చెవిరెడ్డి మాట బాగా చెల్లుతుందని అంటుంటారు. ఇక ఇటీవల బాలినేని శ్రీనివాస్ చేస్తోన్న ఆరోపణలపైనా చెవిరెడ్డి కౌంటర్స్ ఇస్తూ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్నారు.
ఈ సందర్భంగా.. చెవిరెడ్డి వర్సెస్ బాలినేని అనే ఎపిసోడ్ గత కొన్ని రోజులుగా జరుగుతుంది. ఈ సందర్భంగా వాసన్నా వాసన్నా అంటూ బాలినేనిపై చెవిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో బాలినేని నుంచి కౌంటర్లు అదే స్థాయిలో వస్తున్న పరిస్థితి. ఆ సంగతి అలా ఉంటే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.
అవును... వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదయ్యింది. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని యర్రావారిపాలెం మండలానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయని అంటున్నారు.
అయితే.. ఈ వ్యవహారంలో తన కుమార్తెపై అత్యాచారం జరిగినట్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని బాలిక తండ్రి ఆరోపించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. అతనితో పాటూ మరికొందరిపైనా ఇదే సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.
మరి ఇంత కీలకమైన సెక్షన్స్ కింద చెవిరెడ్డిపై కేసు నమోదవ్వడంతో... ఆయన అరెస్టు పై చర్చ మొదలైందని అంటున్నారు. ప్రస్తుతం ఈ చెవిరెడ్డిపై పోక్సో కేసు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది