Begin typing your search above and press return to search.

ఏమిటీ ‘పొలారిస్ డాన్’.. ప్రపంచం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటోంది?

కొద్ది రోజులుగా పొలారిస్ డాన్ ప్రాజెక్టుపై ప్రపంచ వ్యాప్తంగా పేరు మోసిన మీడియా సంస్థలు భారీగా వార్తలు ఇస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 Sep 2024 4:58 AM GMT
ఏమిటీ ‘పొలారిస్ డాన్’.. ప్రపంచం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటోంది?
X

కొద్ది రోజులుగా పొలారిస్ డాన్ ప్రాజెక్టుపై ప్రపంచ వ్యాప్తంగా పేరు మోసిన మీడియా సంస్థలు భారీగా వార్తలు ఇస్తున్నాయి. ఈ మిషన్ తాజాగా సక్సెస్ అయ్యింది. ఇంతకూ పొలారిస్ డాన్ ఏమిటి? అంటే.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రైవేట్ స్పేస్ వాక్ ప్రాజెక్టు. దాని పేరే పొలారిస్ డాన్. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఈ ప్రాజెక్టు తాజాగా సక్సెస్ అయ్యింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఐదు రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్లటం.. వ్యోమిగామి మాదిరి అనుభవం లేకున్నా.. స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జరేద్ ఇసాక్ మాన్. ఆదివారం ఆయన సురక్షితంగా భూమికిచేరుకున్నారు. ఆయన.. ఆయనతో పాటు మరో ముగ్గురు పిల్లలు సిబ్బందితో కూడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాఫ్సూల్్ అమెరికాలోని ఫ్లోరిడా డైటార్టగస్ బీచ్ సమీపంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

భూమి నుంచి 740కి.మీ. ఎత్తులో తొలుత ఇసాక్ మాన్.. తర్వాత స్పెస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ లు స్పేస్ వాక్ లు చేవారు. ఆ తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ గరిష్ఠంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లి మరో రికార్డును క్రియేట్ చేయటం గమనార్హం. చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తర్వాత మానవులతో ఇంత ఎత్తుకు వెళ్లటం చరిత్రలో ఇదే తొలిసారి.

ప్రైవేటు రంగంలో స్పేస్ వాక్ చేసిన మొదటి వ్యక్తిగా.. మొత్తంగా 264 వ్యక్తిగా ఇస్సాక్ మాన్ నిలిచారు. సాధారణంగా స్పేస్ వాక్ ను ప్రొఫెషనల్ వ్యోమగాములు నిర్వహిస్తారు. అయితే.. ఈ ప్రాజెక్టు కోసం బిలియనీర్ దాదాపు 200 మిలియన్ డాలర్లు (మన రూపాయిల్లో దగ్గర దగ్గర 1677 కోట్లు) ఖర్చు చేశారు. అంతరిక్షంలో ఐదు రోజులు గడిపిన ఈ టీం దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. మైక్రో గ్రావిటీలో మనిషి శరీరం ఎలా స్పందిస్తుంది. కిడ్నీల పని తీరు ఎలా ఉంటుంది? వాటిల్లో రాళ్లు ఏర్పడటం.. స్పేస్ లో సీపీఆర్ ప్రొసీజర్ లాంటి అంశాల్ని పరిశీలించారు. ఈ ప్రయోగంలో భాగంగా స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్పేస్ సూట్ లను పరీక్షించారు.