వంశీపై 16 క్రిమినల్ కేసులు.. రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.
By: Tupaki Desk | 14 Feb 2025 4:45 AM GMTగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో.. ప్రభుత్వం తరుపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరుపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అర్ధరాత్రి 2:30 గంటల వరకూ ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి.
ఈ క్రమంలో సుదీర్ఘ వాదనలు విన్న న్యాయముర్తి రామ్మోహన్.. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ వల్లభనేని వంశీతో పాటు అతడి అనుచరులు లక్ష్మీపతి, శివరామ కృష్ణ ప్రసాద్ లకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ఈ సమయంలో వంశీ రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెల్లడించారు.
అవును... వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. ఇందులో భాగంగా... గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో సత్యవర్ధన్ ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఈ సమయంలో మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్థన్ చేశాడని గుర్తించినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో... వంశీకి నేర చరిత్ర ఉందని.. అతనిపై ఇప్పటివరకూ 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని.. సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు!
కాగా... గురువారం ఉదయం వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది! ఈ సమయంలో వంశీతో పాటు అతడి అనుచరులైన శివరామకృష్ణ, లక్ష్మీపతి లపైన పోలీసులు కేసు నమోదు చేశారు.