పార్శిల్ లో మృతదేహం ఎవరిదో తేలింది... తెరపైకి మరో షాకింగ్ విషయం!
ఓ మనిషిని చంపి, చెక్క పెట్టెలో ప్యాక్ చేసి, ఆ పార్శిల్ ను ఆటోలో పెట్టి పంపించడం తీవ్ర సంచలనంగా మారింది!
By: Tupaki Desk | 23 Dec 2024 9:36 AM GMTపశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి గృహ నిర్మాణ సామాగ్రి పేరిట వచ్చిన చెక్క పెట్టెలో శవం కనిపించిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఓ మనిషిని చంపి, చెక్క పెట్టెలో ప్యాక్ చేసి, ఆ పార్శిల్ ను ఆటోలో పెట్టి పంపించడం తీవ్ర సంచలనంగా మారింది!
ఈ ఘటనలో నిందితుడిగా భావిస్తున్న తులసి మరిది శ్రీధర్ వర్మ గురించి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా... ఘటన జరిగినప్పటి నుంచీ శ్రీధర్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు. దీంతో.. పోలీసులకు అనుమానం మరింత బలపడిందని చెబుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో మృతదేహం ఎవరిదనేది గుర్తించారని అంటున్నారు.
అవును.. వెస్ట్ గోదావరిలోని ఉండి మండలంలో పార్శిల్ డెడ్ బాడీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ.. నిందితుడిగా భావిస్తున్నట్లు చెబుతున్న శ్రీధర్ వర్మ గురించి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో.. కాళ్ల గ్రామంలొ అతడి ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారని అంటున్నారు.
ఆ ఇంట్లో వారికి డెడ్ బాడీని పార్శిల్ చేసిన చెక్క పెట్టె మరొకటి కనిపించిందంట. దీంతో.. పోలీసుల అనుమానం మరింత బలపడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... మొబైల్ నెంబర్ ను ట్రేస్ చేస్తుండగా.. సిమ్ కార్డులు, ఫోన్ లు మారుస్తు తప్పించుకుకుంటున్నట్లు చెబుతున్నారు.
మరోపక్క పార్శిల్ లో పంపబడిన మృతదేహం ఎవరిదనే విషయంపై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టగా.. తాజాగా ఆ మిస్టరీ వీడిందని అంటున్నారు. ఇందులో భాగంగా.. కాళ్ల గాంధీనగర్ కు చెందిన పర్లయ్య అనే వ్యక్తిగా గుర్తించారని అంటున్నారు! మద్యానికి బానిసైన పర్లయ్యను.. పనికి తీసుకెళ్లిన సుధీర్ వర్మ.. హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇక.. శ్రీధర్ వర్మ ఇప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. ప్రస్తుతం మూడో భార్యతో కాళ్ల గ్రామంలో ఉంటున్నట్లు తేలిందని చెబుతున్నారు. దీంతో... ఈ బాక్సులో మృతదేహాన్ని ఆటోకు ఇచ్చిన ఎర్ర కారులో మాస్క్ తో కనిపించిన మహిళ ఆమె అయ్యి ఉండొచ్చనే చర్చ మొదలైందని అంటున్నారు.