Begin typing your search above and press return to search.

వండుతున్న ఆహారంలో బూడిద పోసిన పోలీస్... వీడియో వైరల్!

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Feb 2025 5:41 AM GMT
వండుతున్న ఆహారంలో బూడిద పోసిన పోలీస్... వీడియో వైరల్!
X

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు కోట్ల సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో... వారందరికీ ఆకలి తీర్చేందుకు అనేక మంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తరలవస్తున్న భక్తుల కోసం అక్కడికక్కడే వండి వేడి వేడి ఆహారాన్ని అందిస్తుంటారు. వారి ఆకలి తీరుస్తుంటారు. ఇలా ఆధ్యాత్మిక చింతనతో వస్తోన్న భక్తులకు ఆకలి తీర్చే అద్భుతమైన కార్యక్రమం వద్దకు తాజాగా వెళ్లిన ఓ పోలీస్ అధికారి.. అక్కడ జరుగుతున్న వంటల్లో బూడిద పోశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

అవును.. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు తరలివస్తోన్న కోట్లాది మంది భక్తులలో కొంతమందికి పలువురు భక్తులు స్వచ్ఛందంగా ఆహారాన్ని సిద్ధం చేసి అందిస్తున్నారు. పుణ్యస్థానాల కోసం తరలి వస్తున్న భక్తులకు అన్నదాన కారక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. అలాంటి ఒక చోటుకు వచ్చిన పోలీస్ అధికారి ఒకరు దారుణంగా ప్రవర్తించారు.

ఈ సమయంలో భండారా వద్ద భక్తులకు ఆహారం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇటుకల పొయ్యిపై పెద్ద పెద్ద పాత్రల్లో అన్నం, కూరగాయలు వండుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన ఓ పోలీస్ అధికారి అక్కడే ఉన్న బూడిద (బూడిద కలిసి మట్టి) తీసుకొచ్చి ఉడుకుతున్న వంటల్లో పోశారు. దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇది చూసిన భక్తులు ఒక్కసారిగా ఆధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతటి పవిత్ర కార్యక్రమానికి తరలి వస్తున్న భక్తుల కోసం సమకూరుస్తున్న వంటల్లో బూడిద పోయడం ఏమిటంటూ మండిపడుతున్నారు. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆన్ లైన్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు యూపీ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ... కుంభమేళాకు తరలివస్తున్న భక్తులకు ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వారి మంచి ప్రయత్నాలను.. రాజకీయ శతృత్వం కారణంగా నాశనం చేయడం దారుణం అని రాసుకొచ్చారు!

ఈ పరిణామాల నేపథ్యంలో సదరు పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు సిద్ధమయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో... సదరు పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారని తెలుస్తోంది. ఇలాంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించకూడదని భక్తులు కామెంట్ చేస్తున్నారు.