Begin typing your search above and press return to search.

హత్యకు ముందు గురుమూర్తికి క్లీన్ చిట్.. అలాంటోడు అలా చేశాడా?

సాయం అడిగితే కాదనకుండా చేస్తాడని.. అలాంటి వ్యక్తి ఇంత దారుణంగా ప్రవర్తించాడో తమకు అర్థం కావట్లేదంటూ చెబుతున్న విషయాలు పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 8:30 AM GMT
హత్యకు ముందు గురుమూర్తికి క్లీన్ చిట్.. అలాంటోడు అలా చేశాడా?
X

భార్యను చంపి.. శవాన్ని మాయం చేసే క్రమంలో అత్యంత రాక్షసంగా.. కిరాతకంగా వ్యవహరించిన గురుమూర్తి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. జాతీయ స్థాయిలోనూ నివ్వెరపోయేలా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురుమూర్తిది ఎలాంటి తీరు? తాను పని చేసే చోట ఎలా వ్యవహరిస్తాడు? అతని వైఖరి ఎలా ఉంటుంది?లాంటి అంశాలపై పోలీసులు ఫోకస్ చేయగా.. విస్మయకర నిజాలు వెలుగు చూశాయి. గురుమూర్తిది మెతక స్వభావమని.. తాను పని చేసే చోట ఇతరులతో చక్కగా ప్రవర్తించటమే కాదు.. విధుల్లోనూ క్రమశిక్షణకు మారుపేరు అన్నట్లుగా ఉంటాడనిపేర్కొన్నారు.

సాయం అడిగితే కాదనకుండా చేస్తాడని.. అలాంటి వ్యక్తి ఇంత దారుణంగా ప్రవర్తించాడో తమకు అర్థం కావట్లేదంటూ చెబుతున్న విషయాలు పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నట్లుగా చెబుతున్నారు.మీర్ పేట వివాహిత కిరాతక హత్య కేసుకు సంబంధించి నిందితుడు గురుమూర్తి (భర్త) తీరుపై పోలీసులు విచారణ చేపట్టారు. అతను పని చేసే చోట సహోద్యోగులు చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

నిందితుడు గురుమూర్తి డీఆర్ డీవోలో కాంట్రాక్టు విధానంలో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. అతడి తీరు గురించి తెలుసుకునేందుకు అతడు పని చేసే చోట అతని గురించి విచారించారు పోలీసులు.ఈ క్రమంలో అతడి క్రమశిక్షణ గురించి సహోద్యోగులు చెప్పిన మాటలు..అతను చేసిన ఘోరానికి భిన్నంగా ఉన్నాయి. సాయం చేసే వ్యక్తిత్వమని.. ప్లాస్టిక్ వస్తువులు వాడేందుకు ఇష్టపడడని.. ఛాయ్ తాగేందుకు.. భోజనం తెచ్చే క్యారేజీ కోసం ప్లాస్టిక్ ఉపయోగిండని పేర్కొన్నారు.

ఇటీవల తనకు తెలిసిన ఒక వ్యక్తికి జాబ్ లోకి పెట్టించినట్లుగా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇరుగు పొరుగుతో గురుమూర్తి ఎక్కువగా మాట్లాడేవాడు కాదని స్థానికులు చెబుతుననారు. భార్య శవాన్ని ఎలాగైనా మాయం చేయాలన్న ఉద్దేశంతో ఇంత దారుణంగా వ్యవహరించి ఉంటారని భావిస్తున్నారు. హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు.. ఇరుగుపొరుగు నుంచి మరిన్ని వివరాలు సకరించారు.

గురుమూర్తి ఉండే భవనంలోని మరో వ్యక్తి 15వ తేదీ ఉదయం బయటకు వెళ్లి ఇంటికి వచ్చాడు.అప్పటికే భార్యను చంపిన గురుమూర్తి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లోకి వెళ్లే సమయంలో దుర్వాసన ఎక్కువగా రావటాన్ని గమనించాడు. అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ.. పండగ సమయంలో ఎవరో మాంసం వండుకుంటున్నారనే భావనతో పట్టించుకోకుండా వదిలేశాడని తెలిసింది. భార్యను చంపేసి.. ముక్కలు.. ముక్కలు కాల్చేసిన విషయం తెలుసుకొని హడలిపోయిన అతగాడు ఇంటికి ఖాళీ చేసి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. భార్యను చంపి.. శవాన్ని మాయం చేసే క్రమంలో గురుమూర్తి వ్యవహరంచిన తీరుకు.. అతడి వ్యవహరశైలి పూర్తి భిన్నంగా ఉండటం పోలీసు వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.