Begin typing your search above and press return to search.

బొయినపల్లిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం... తెరపైకి షాకింగ్ విషయాలు!

హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారాలు తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్నట్లుగా పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Aug 2024 9:50 AM GMT
బొయినపల్లిలో భారీగా డ్రగ్స్  స్వాధీనం... తెరపైకి షాకింగ్  విషయాలు!
X

హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారాలు తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్నట్లుగా పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవహారాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా సిటీలోని పలు ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు నిర్వహించి డ్రగ్స్ రాకెట్లను ఛేదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. కిలోల కొద్దీ డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది పూర్తిగా సిటీలో వినియోగానికేనా.. లేక, ఇతర ప్రాంతలకు తరలించడానికా అనే చర్చ మొదలైంది.

అవును... హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లి పరిధిలో పోలీసులు తాజాగా భారీ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఇందులో భాగంగా... సుమారు రూ.8.5 కోట్ల విలువైన 8.5 కిలోల ఎఫిటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో వీటితో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి.. కారు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం రాత్రి జిన్నారం నుంచి ముగ్గురు వ్యక్తులు ఎఫిటమైన్ డ్రగ్స్ ను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందంట. వాటిని బోయిన్ పల్లి మీదుగా సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్దకు డెలివరీ చేసేందుకు కారులో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో వాహనాన్ని డెయిరీ ఫాం.. రోడ్డు వద్ద అడ్డుకున్నారు.

ఈ సమయంలో... కారు డ్రైవర్ తో పాటు మరోక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఈ డ్రగ్స్ కారు డిక్కీలో ఉంచినట్లు గుర్తించారు.

మరోవైపు... రాజేంద్రనగర్ లోనూ పోలీసులు డ్రగ్స్ సీజ్ చేశారు. ఇందులో భాగంగా... 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నైజీరియాకు చెందిన మహిళను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని అంటున్నారు. బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో వీటిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.