Begin typing your search above and press return to search.

ఫుడ్ వోచర్లు వేరేవాటికి వాడితే జాబ్ తీసేస్తారా?... ఎక్కడైనా ఉందా ఇది?

ఇది మెటాలో పనిచేసే వ్యక్తుల పాలసీ ఉల్లంఘనగా దీన్ని పరిగణించినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   19 Oct 2024 3:38 PM GMT
ఫుడ్ వోచర్లు వేరేవాటికి వాడితే జాబ్  తీసేస్తారా?... ఎక్కడైనా ఉందా ఇది?
X

ప్రస్తుతం మెటా టెక్ సంస్థ ఉద్యోగులు ఇదే ప్రశ్న వేస్తున్నారు. "అందరివాడు" సినిమాలో ప్రకాశ్ రాజ్ ఇంటిలో ఫంక్షన్ కి ఆలస్యంగా వచ్చిన సునీల్ చెంపదెబ్బ అనంతరం... "నిశ్చితార్ధానికి రాకపోతే కొట్టేస్తారా.. ఎక్కడైనా ఉందా ఇది?" అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారట మెటా సంస్థలోని ఉద్యోగులు.

అవును... ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ యజమాని అయిన మెటా టెక్ సంస్థ మీల్ వోచర్ సిస్టమ్ ను దుర్వినియోగం చేసినందుకు లాస్ ఏజిల్స్ లోని ఆఫీసులో సుమారు 24 మంది సిబ్బందిని తొలగించారు. వారు.. ఈ ఫుడ్ వోచర్ ను టూత్ పేస్ట్, వాషింగ్ పౌండర్ వంటివి కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారంట.

ఇది మెటాలో పనిచేసే వ్యక్తుల పాలసీ ఉల్లంఘనగా దీన్ని పరిగణించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మెటా సిబ్బంది భోజనం కోసం $25, అల్పాహారం కోసం $20, రాత్రి భోజనం కోసం $25 విలువైన మీల్ వోచర్లను అందుకుంటారు. ఇది యూఎస్ జస్ట్ ఈట్ కి సమానమైన గ్రబ్ హబ్ ద్వారా ఆహరాన్ని ఆర్డర్ చేయడానికి ఉద్దేశించబడింది.

అయితే ఈ వోచర్లను టూత్ పేస్ట్, టూత్ బ్రష్, వైన్ గ్లాస్ లను కనుగోలు చేయడానికి ఉపయోగించగా.. మరికొంతమంది మొటిమల ప్యాడ్ ల వంటి ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు కనుగొనబడిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.