Begin typing your search above and press return to search.

మరో రెండు సర్వేలు...వచ్చే ప్రభుత్వం ఎవరిది...?

తెలంగాణా ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. ఒక విధంగా జనం తీర్పునకు కౌట్ డౌన్ స్టార్ట్ అయింది.

By:  Tupaki Desk   |   5 Nov 2023 3:17 PM GMT
మరో రెండు సర్వేలు...వచ్చే ప్రభుత్వం ఎవరిది...?
X

తెలంగాణా ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. ఒక విధంగా జనం తీర్పునకు కౌట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ సందట్లో సడేమియా అన్నట్లుగా సర్వేలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఈ ప్రీ పోల్ సర్వేలలో ఏది నిజం అవుతుంది ఏది కాదు అంటే అదంతా తేలాల్సింది ఈ నెల 30న జరిగే పోలిగింగ్ రోజునే.

ఇదిలా ఉంటే తెలంగాణాలో కాంగ్రెస్ కి ఓట్ల షేర్ పరంగా ఆధిక్యాన్ని చూపిస్తూ స్పిక్ మీడియా సంస్థ తాజాగా నివేదినకు ఇచ్చింది. ఈ సర్వే నివేదిక ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 40.26 శాతం, ఓట్ల షేర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

అదే విధంగా బీయారెస్ కి 37.5 శాతం ఓటింగ్ వస్తే బీజేపీకి 11. 97 శాతం ఓటింగ్ షేర్, మజ్లీస్ కి 5.01 ఓట్ షేర్ వస్తుందని ఈ సర్వే తేల్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వే పరంగా స్పష్టం చేసినట్లు అయింది. దాంతో కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా విభాగంలో ఈ సర్వే నివేదికను పోస్ట్ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఖద్దరు పార్టీ నేతలు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే జీ న్యూస్ మాట్రైజ్ అనే మరో సంస్థ కూడా సర్వే చేసి ఆ వివరాలను బయటపెట్టింది. ఈ సర్వే ప్రకారం చూస్తే అధికార బీయారెస్ కి 70 నుంచి 76 సీట్ల దాకా వస్తాయని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కి 27 నుంచి 33 దాకా సీట్లు వస్తే బీజేపీకి 5 నుంచి 8 దాకా సీట్లు సాధిస్తుందని పేర్కొంది. మజ్లీస్ ఆరేడు సీట్లు గెలిస్తే ఇతరులు ఒక సీటు గెలుచుకుంటారని సర్వే పేర్కొంది.

ఈ సర్వే బీయారెస్ ని ఖుషీ చేస్తోంది. అదే సమయంలో స్పిక్ మీడియా సర్వే కాంగ్రెస్ లో జోష్ నింపుతోంది. పోలింగ్ కి ఇంకా పాతిక రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ నేపధ్యంలో వస్తున్న సర్వేలు తలో రకంగా ఉంటున్నాయి. కొన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే మరికొన్ని బీయారెస్ అని అంటున్నారు. మరి జనాల చేతిలో తీర్పు ఉంది. వారు ఏమంటారో చూడాల్సి ఉంది.