'సచివాలయం' చుట్టూ రాజకీయ రగడ!?
అయితే.. దీనిలో ప్రస్తుత ఎన్నికల అనంతరం.. కేసీఆర్ ఇక్కడ నుంచే పాలన సాగించాలని అనుకున్నా రు.
By: Tupaki Desk | 7 Dec 2023 3:15 AM GMTతెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి సచివాలయం కేంద్రంగానే పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా మంత్రులు, ఇతర అధికారులు కూడా పనిచేయాల్సి ఉంది. అయితే.. దీనిని మాజీ సీఎం కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే.
అయితే.. దీనిలో ప్రస్తుత ఎన్నికల అనంతరం.. కేసీఆర్ ఇక్కడ నుంచే పాలన సాగించాలని అనుకున్నా రు. కానీ, అనూహ్యంగా ఆయన ఓడిపోయారు. అయితే.. ఇప్పుడు ఈ సచివాలయం కేంద్రంగా రాజకీయం రాజుకుంది. దీనిని కేసీఆర్ కట్టించారని.. ఏ ప్రభుత్వం వచ్చినా.. ఏ పార్టీ నాయకుడు మంత్రి అయినా.. ముఖ్యమంత్రి అయినా ఇక్కడ నుంచే పాలన చేయాలని బీఆర్ ఎస్ నాయకులు గర్వంగా చెబుతున్నారు.
మరోవైపు.. ఇదేమీ.. కేసీఆర్ సొంత నిధులతో నిర్మించింది కాదని ఇతర పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదిలావుంటే.. ఈ ప్రతిపక్షాల వ్యాఖ్యల్లో టీడీపీ నాయకులు కూడా కొందరు ఉండడంతో వివాదం ముదిరిం ది. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని.. ఆయన తన హయాంలోనే అత్యద్భుతమైన సచివాలయాన్ని నిర్మించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ, టీడీపీ -అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఎలాంటి సచివాలయం కట్టారో.. అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేస్తున్నారు.
ఇదిలావుంటే.. 28 ఎకరాల్లో రూ.610 కోట్ల వ్యయంతో నిర్మాణమైన తెలంగాణ నూతన సచివాలయ భవనం ఇండో పర్షియన్ అరేబియన్ శైలిలో, దక్కన్, కాకతీయ శాలివాహన సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించారు. కేవలం 26 నెలల్లో నిర్మాణం పూర్తి చేశారు. 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 8 అంతస్తుల్లో నిర్మించారు. 30 కాన్ఫరెన్స్ హాల్స్.. 635 గదులు ఉన్నాయి. మొత్తం లిఫ్టులు 24, దేశంలో గోల్డ్ బిల్డింగ్ సర్టిఫికెట్ కలిగిన ఏకైక నిర్మాణం కావడం గమనార్హం.