Begin typing your search above and press return to search.

వైసీపీలో సైలెంట్ బాంబులు... పేలుతాయా ?

అది చివరికి ఒక్కోసారి కొంప ముంచినా ముంచవచ్చు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   11 Aug 2024 1:18 PM GMT
వైసీపీలో  సైలెంట్ బాంబులు... పేలుతాయా ?
X

పొలిటికల్ గా ఎవరైనా సైలెంట్ గా ఉన్నారు అంటే ఏదో డేంజర్ సిగ్నలే అని అంటారు. ఎందుకంటే సైలెంట్ గా ఉంటూ పదునైన ఆలోచనలకు పనిపెడతారు అని అంటున్నారు. రాజకీయాలు ఎపుడూ ఎత్తులు వ్యూహాల మీదనే ఆధారపడి సాగుతాయి. స్వపక్షంలో కానీ విపక్షంలో కానీ ఎప్పటికప్పుడు సైలెంట్ కిల్లర్స్ ఎవరు ఉన్నారో చెక్ చేసుకోవడం రాజకీయ పార్టీల అధినాయకత్వం చేయాల్సిన గురుతర కర్తవ్యం అంతా బాగానే ఉంది అనుకుంటే సైలెంట్ గా బాంబులే పేల్చుతారు.

అది చివరికి ఒక్కోసారి కొంప ముంచినా ముంచవచ్చు అని అంటున్నారు. వైసీపీలో చూస్తే రీసెంట్ గా ఒక పొలిటికల్ డెవలప్మెంట్ జరిగింది. మాజీ మంత్రి ఆళ్ళ నాని గప్ చిప్ గా తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ఒక ఆరు లైన్ల లెటర్ రాసి పంపేశారు. ఆయన పార్టీలో సైలెంట్ గా చాలా కాలం నుంచి ఉంటున్నారు. అయినా ఆయన వైఖరి ఏమిటో పార్టీ ఆరా తీయలేదు.

సడెన్ గా చూస్తే ఆయన బాంబు పేల్చారు. దీంతో ఇపుడు వైసీపీ హై కమాండ్ అలెర్ట్ అవుతోంది అని అంటున్నారు. వైసీపీలో ఎవరు సైలెంట్ గా ఉన్నారు అన్నది ఆరా తీసే పనిలో పడింది అని అంటున్నారు. అయితే వైసీపీలో కనీసంగా ఒక యాభై మంది దాకా నేతలు సైలెంట్ మోడ్ లో ఉన్నారని అంటున్నారు. వీరిలో మాజీ మంత్రులు సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఉన్నారని అంటున్నారు.

వైసీపీ దారుణ పరాజయం ఒక ఎత్తు అయితే ఆ మీదట పార్టీ గత రెండు నెలలుగా నడుస్తున్న తీరుని చూసిన వారు కూడా ఆలోచించి పార్టీకి గుడ్ బై కొడుతున్నారు అని అంటున్నారు. వైసీపీలో ఇప్పటిదాకా రాజీనామా చేసిన వారిలో గుంటూరు జిల్లా నుంచి కిలారి రోశయ్య, మద్దాల గిరి, అలాగే నెల్లూరు జిల్లా నుంచి మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, అనంతపురం జిల్లా నుంచి జిల్లా ప్రెసిడెంట్ పైలా నర్సింహయ్య పార్టీ నుంచి తప్పుకున్నారు

మరి కొందరు నేతలు కూడా అదే బాటలో నడుస్తారు అని అంటున్నారు. వైసీపీ అధికారం నుంచి దిగిపోగానే చాలా మందికి రాజకీయ బెంగ ఏర్పడింది అని అంటున్నారు. దాంతో పాటు పార్టీ పోకడలు కూడా ఆలోచనలో పడేశాయి అని అంటున్నారు. అధినాయకత్వం ఎప్పటికీ తమ తప్పులను తెలుసుకోకుండా వ్యవహరించడం పార్టీ ప్రక్షాళనకు పూనుకోకపోవడం టీడీపీని చంద్రబాబుని విమర్శిస్తూ కాలక్షేపం చేయడం పట్ల కూడా అనేక మంది విరక్తిగా చెందారు అని అంటున్నారు.

ఇక వైసీపీలో కొనసాగకూడదు అనుకున్న వారికి సహజంగా టీడీపీ ఆప్షన్ గా ఉంటుంది. కానీ అక్కడ హౌజ్ ఫుల్ బోర్డు వేలాడుతోంది. వస్తే తీసుకోవచ్చు కానీ ఎలాంటి హామీలు ప్రయారిటీలు ఉండవు. ఇక జనసేనలో చూస్తే అక్కడ కూడా కొన్ని చోట్ల అవకాశం ఉంది అలా లేని వారు ఇక రాజకీయం వద్దు అనుకుంటున్నారు. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండడమే బెటర్ అని భావించి తప్పుకుంటున్నారు.

వైసీపీని పూర్తిగా కూటమి ప్రభుత్వం ఎండగడుతున్న నేపధ్యంలో తాము ఆ పార్టీలో ఉంటూ పోరాడలేక జవాబు చెప్పలేక ఎందుకు అనుకున్న వారు కూడా గుడ్ బై కొట్టేస్తున్నారు. రానున్న రోజులలో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలలో ఎక్కువగా సైలెంట్ గా రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించే వారు ఉంటారని అంటున్నారు.

అయితే వైసీపీ అధినాయకత్వం ఎవరినీ బుజ్జగించదలచుకోలేదు అని అంటున్నారు. జగన్ అయితే తాను ఒక్కడినే పార్టీ పెట్టి దానిని ఈ స్థాయిని తెచ్చామని ఇపుడు కూడా అలాగే పోరాడుతామని భావిస్తున్నారని అంటున్నారు. పార్టీ తీసుకునే లైన్ నచ్చి ఉండేవారితోనే నడిపించాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.

పార్టీకి ఎదురైన ఓటమి కంటే నేతలు బయటకు వెళ్ళిపోవడం సమస్య కాదని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఎపుడైనా ప్రజలే నిర్ణేతలు అని వారు కనుక వైసీపీని ఆదరించిన పక్షంలో రేపటి రోజున కొత్త నాయకులు అయినా వచ్చి పార్టీలో చేరుతారు అన్నది వైసీపీ హై కమాండ్ ఆలోచనగా చెబుతున్నారు ఏది ఏమైనా వైసీపీలో మరిన్ని సైలెంట్ బాంబులు ఉండవచ్చు అన్నది లేటెస్ట్ టాక్. అవి ఎపుడైనా ఏ సమయంలో అయినా పేలవచ్చు అన్నది కూడా ప్రచారంలో ఉంది. మరి ఆ సైలెంట్ బాంబులు ఏవి అంటే వెయిట్ అండ్ సీ.