Begin typing your search above and press return to search.

మోడీ వైపే జ‌నాల మూడ్‌.. తాజాగా స‌ర్వేలో హాట్ రిజ‌ల్ట్‌

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంది? ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు..? అనే విష‌యాలు ఆస‌క్తిగా ఉన్నాయి

By:  Tupaki Desk   |   13 March 2024 6:01 PM GMT
మోడీ వైపే జ‌నాల మూడ్‌.. తాజాగా స‌ర్వేలో హాట్ రిజ‌ల్ట్‌
X

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంది? ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు..? అనే విష‌యాలు ఆస‌క్తిగా ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో బీజేపీ ప‌క్షాన ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌స్తుత పీఎం న‌రేంద్ర మోడీ ఉండ‌గా, కాంగ్రెస్ త‌ర‌ఫున అప్ర‌క‌టిత ప్ర‌ధాని అభ్య‌ర్థిగా రాహుల్‌గాంధీ ఉన్నారు. వీరిలో ప్ర‌జ‌లు ఎవ‌రిని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు? ఎవ‌రి వైపు మొగ్గు చూపుతున్నారు? కీల‌క‌మైన విష‌యాల్లో ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు సంబంధించి ప్ర‌జ‌ల అభిప్రాయం ఎలా ఉంది? అనే అంశాల‌పై తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో హాట్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. మెజారిటీ ప్ర‌జ‌లు మోడీని, ఆయ‌న నాయ‌క‌త్వాన్నే కోరుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే ఫ‌లితాలు ఇవీ..

+ త‌దుప‌రి ప్ర‌ధాని ఎవ‌రు?

59 శాతం మంది నరేంద్ర మోడీకే మొగ్గు చూపారు. కేవ‌లం 21 శాతం మంది మాత్ర‌మే రాహుల్ గాంధీ ప్ర‌ధాని అయితే బాగుంటుంద‌న్నారు.

+ నిజాయితీప‌రుడు ఎవ‌రు?

73 శాతం మంది మోడీని నిజాయితీప‌రుడిగా పేర్కొన్నారు. 27 శాతం మంది రాహుల్ గాంధీ పేరును ప్ర‌స్తావించారు.

+ క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే నాయ‌కుడు ఎవ‌రు?

ప్ర‌ధాని మోడీకి 69 శాతం మంది జై కొట్టారు. రాహుల్ గాంధీకి 31 శాతం మంది మ‌ద్ద‌తు తెలిపారు.

+ ప్రజల గురించే ఆలోచించే నేత ఎవ‌రు?

ఈ ప్ర‌శ్న‌కు కూడా మోడీనేన‌ని 71 శాతం మంది కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. 29 శాతం మంది మాత్ర‌మే రాహుల్ వెంట నిలిచారు.

+ బ‌ల‌మైన నాయ‌కుడు ఎవ‌రు?

67 శాతం మంది మోడీ అని పేర్కొన్నారు. కేవలం 33 శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీ పేరు చెప్పారు.

+ భారత భవిష్యత్తుపై సరైన ఆలోచన ఉన్న నేత ఎవ‌రు?

ఈ ప్ర‌శ్న‌కు అనూహ్యంగా 68 శాతం మంది మోడీకి ఓటు వేస్తే, రాహుల్ గాంధీకి 32 శాతం మంది ఓటేశారు.

స‌ర్వే సాగిందిలా..

21 రాష్ట్రాల్లోని 518 లోక్ సభ నియోజకవర్గాల్లో విస్తృత సర్వే నిర్వహించారు. 1,18,616కు పైగా శాంపిల్స్ సేకరించారు. దాదాపు 95 శాతం లోక్ సభ నియోజకవర్గాలను కవర్ చేశారు.