Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మంత్రికి జగన్ వాసనలు పోలేదా ?

ఈ నేపధ్యంలో ఒక స్టేట్ లో ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే రెండవ స్టేట్ లో ఎందుకు రాలేదు అన్న మాట వస్తుంది.

By:  Tupaki Desk   |   18 Dec 2024 3:43 AM GMT
కాంగ్రెస్ మంత్రికి జగన్ వాసనలు పోలేదా ?
X

తెలంగాణా ఏపీ రెండుగా విడిపోయాక అభివృద్ధి విషయంలో పోటీ అయితే పెరిగింది. అలాగే రెండు ప్రాంతాల ప్రజలు కూడా ఒకరిని చూసి ఒకరు పోలిక పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ నేపధ్యంలో ఒక స్టేట్ లో ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే రెండవ స్టేట్ లో ఎందుకు రాలేదు అన్న మాట వస్తుంది.

మీడియా సైతం వీటినే హైలెట్ చేస్తూ ఉంటాయి. ఇక ఏపీలో సీఎం గా చంద్రాబాబు నాలుగవ సారి ప్రమాణం చేశాక పూర్తిగా అమరావతి మీద దృష్టి పెట్టారు. అమరావతికి నిధులు కూడా సమకూరుస్తున్నారు. మూడేళ్ల పాటు టైం బౌండ్ పెట్టుకుని మరీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

అమరావతిని దేశంలోనే నంబర్ వన్ గా చేయాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో పెట్టుబడిదారులకు కూడా పెద్ద ఎత్తున ఆహ్వానాలు వెళ్తున్నాయి. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు చంద్రబాబు కూడా ఇన్వెస్టర్లకు అనుకూలమైన పాలసీని రూపొందిస్తున్నారు.

ఇక రియల్ ఎస్టేట్ బూమ్ అన్నది అమరావతికి మొదలైంది అన్న వార్తలూ ఉన్నాయి ఈ నేపధ్యంలో తెలంగాణాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమరావతి రాజధాని గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని హాట్ కామెంట్స్ చేశారు.

ఇటీవల వచ్చిన వరదలతో అమరావతి ఇబ్బంది పడిందని దానిని చూసిన ఇన్వెస్టర్లు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సందేహిస్తున్నారు అని ఆయన కామెంట్స్ చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక అభివృద్ధి అంతా అమరావతికే వెళ్ళింది అన్న మాట కూడా తప్పు అని ఆయన చెప్పడం విశేషం. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో బాగానే ఉందని ఇన్వెస్టర్లు తమ చాయిస్ గా హైదరాబాద్ నే ఈ రోజుకీ ఎంపిక చేసుకుంటున్నారు అని మాట్లాడారు.

దీని మీద టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు. అమరావతికి చంద్రబాబు నాయకత్వంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రోత్సాహంతో ఇన్వెస్టర్లు అందరూ పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నారని అన్నారు.

అమరావతి రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించడం ఖాయమని చెప్పారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే దీని మీద విమర్శలు చేస్తున్నారని, అయనకు జగన్ మిత్రుడిగా ఉన్న నాటి వాసనలు ఇంకా పోలేదని సెటైర్లు వేశారు. వైసీపీ నేతలు ఏదైతే మాట్లాడుతున్నారో అదే శ్రీనివాసరెడ్డి కూడా అన్నారని ధూళి పాళ్ల కామెంట్స్ చేశారు

మొత్తానికి చూస్తే తెలంగాణా కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు ఇపుడు సంచలనం అయ్యాయి. దానికి రిటర్టు అన్నట్లుగా ధూళిపాళ్ళ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వైరల్ అవుతోంది. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో ఏమిటో చూడాల్సి ఉంది.