Begin typing your search above and press return to search.

సాహ‌సం చేశారు.. సాధించారు.. 'డ‌బుల్' విన్న‌ర్స్‌.. !

రాజ‌కీయాల్లో సాహ‌సాలు అంద‌రూ చేస్తారు. కానీ, కొంద‌రు మాత్ర‌మే క్లిక్ అవుతారు. అదికూడా ఊహించ‌ని విధంగా డబుల్ విజ‌యం ద‌క్కించుకోవ‌డం మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌రం.

By:  Tupaki Desk   |   9 Dec 2023 3:36 AM GMT
సాహ‌సం చేశారు.. సాధించారు.. డ‌బుల్ విన్న‌ర్స్‌.. !
X

రాజ‌కీయాల్లో సాహ‌సాలు అంద‌రూ చేస్తారు. కానీ, కొంద‌రు మాత్ర‌మే క్లిక్ అవుతారు. అదికూడా ఊహించ‌ని విధంగా డబుల్ విజ‌యం ద‌క్కించుకోవ‌డం మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌రం. ఇప్పుడు ఈ విజ‌యాన్నే ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు ఎంజాయ్ చేస్తున్నారు. వారే.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి. ఎన్నిక‌ల‌కు ముందు.. వీరిద్ద‌రూ చేసింది గొప్ప సాహ‌స‌మ‌నే చెప్పాలి. బీఆర్ ఎస్ పార్టీ వీరిని ప‌ట్టించుకోక‌పోవ‌డం.. ఇత‌ర పార్టీల నుంచి ఆఫ‌ర్లు రావ‌డం.. కామ‌న్‌గా జ‌రిగింది.

అయితే.. బుద్ధి కుశ‌ల‌త వినియోగించి.. ఈ ఇద్ద‌రు నాయ‌కులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆవెంట‌నే టికెట్లు తెచ్చుకున్నారు. అయితే.. పార్టీలు మారేవారిని ఓడించాలంటూ.. కాంగ్రెస్ పార్టీనే పిలుపునివ్వ‌డంతో వీరిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ వెంట‌నే మంత్రులు కూడా ప్ర‌మోట్ అయ్యారు. ఇది వారికి ఈ ఏడాది ద‌క్కిన డబుల్ స‌క్సెస్ అన‌డంలో సందేహం లేదు.

మాజీ ఎంపీ అయిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అతి తక్కువ కాలంలోనే మాస్‌ లీడర్‌గా ఎదిగారు. తొలుత కాంట్రాక్టర్‌గా పనిచేసిన పొంగులేటి, 2013 ఫిబ్రవరి 23న వైసీపీలో చేరారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పొంగులేటి అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచారు. పాలేరు ఉప ఎన్నికల సమయాన 2016 మే 3న బీఆర్‌ఎస్‌లో చేరిన పొంగులేటి తనకు సముచిత స్ధానం దక్కలేదనే కారణంతో ఈ ఏడాది జనవరి 1న పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మంత్రి అయ్యారు.

ఇక‌, తుమ్మ‌ల ప్ర‌స్తానం కూడా దాదాపు ఇంతే. ఆయ‌న కూడా మూడు పార్టీలు పార్టీలు. టీడీపీ-బీఆర్ ఎస్‌- కాంగ్రెస్‌. పాలేరు టికెట్ ఇచ్చే అవ‌కాశం లేక‌పోవ‌డం.. కేసీఆర్ ద‌గ్గ‌ర చునువు క‌ట్ అయిపోవ‌డంతో తుమ్మ‌ల‌.. ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్లో చేరారు. గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్టం అనుకున్నప్ప‌టికీ.. గెలిచి చూపించారు. మొత్తానికి ఒక్క గెలుపుతోనే కాకుండా.. మంత్రి పీఠాన్ని కూడా అందుకున్నారు.