Begin typing your search above and press return to search.

టీడీపీ కార్యాలయంలో పొంగులేటి... ఏపీలో కొత్త సందేహాలు!

ఈ క్రమంలో తాజాగా ఈరోజు ఖమ్మంలోని తెలంగాణ టీడీపీ కార్యాలయంలో కనిపించారు పొంగులేటి. ఇదే సమయంలో కమ్యునిస్టు నాయకులతోనూ భేటీ అయ్యారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 1:03 PM GMT
టీడీపీ కార్యాలయంలో పొంగులేటి... ఏపీలో కొత్త సందేహాలు!
X

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆసక్తికరపరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఒక చర్చకు కన్ ఫర్మేషన్ కూడా వచ్చేసింది! ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఈరోజు ఖమ్మం జిల్లాలోని టీడీపీ ఆఫీసులో కనిపించారు. ఇదే సమయలో కమ్యునిస్టు నేతలనూ కలిశారు.. వారిని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి!

అవును... ఎన్నికలకు ముందు పార్టీని వీడి కాంగ్రెస్‌ లో చేరిన అతికొద్ది మంది బీఆరెస్స్ నేతల్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒకరు. తాను చేసిన ఛాలెంజ్ మేరకు అన్నట్లుగా ఖమ్మం నుంచి ఆయన భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా ఖమ్మం జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలూ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో కీలక భూమిక పోషించారు. దీంతో... ఆయన కష్టాన్ని, కమిట్ మెంట్ ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అతనికి మంత్రిపదవి ఇచ్చి గౌరవించింది.

ఈ క్రమంలో తాజాగా ఈరోజు ఖమ్మంలోని తెలంగాణ టీడీపీ కార్యాలయంలో కనిపించారు పొంగులేటి. ఇదే సమయంలో కమ్యునిస్టు నాయకులతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా... తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు పూర్తి మద్ధతు ఇచ్చారంటూ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావాలనుకున్న కల సాకారమవ్వడంలో టీడీపీ నేతలు, కార్యకర్తల పాత్ర ఉందని.. కమ్యునిస్టుల కష్టం ఉందని తెలిపారు.

ఇదే సమయంలో... ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు అప్పుడప్పుడు పరధ్యానంలో ఉన్నా, టీడీపీ మద్దతుదారులు మాత్రం పట్టువిడవకుండా కాంగ్రెస్ కోసం పనిచేశారని.. ఇక నుంచి టీడీపీ, కాంగ్రెస్‌ ల మధ్య విభేదాలు ఉండవని, అందరం కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఇదే క్రమంలో... టీడీపీ క్యాడర్ చేసిన సహకారాన్ని హస్తం పార్టీ ఏనాటికీ మర్చిపోదని స్పష్టం చేశారు పొంగులేటి.

కాగా... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరించడం కోసమే టీడీపీ పోటీ విరమించుకుందని.. రేవంత్ కోసమే చంద్రబాబు అస్త్రసన్యాసం చేశారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో ఆ ఆరోపణలు, ఊహాగాణాలను నిజం చేస్తూ పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. మరి ఈ స్నేహం ఏపీలోనూ ఉంటుందా.. లేక, ఈ బంధం తెలంగాణకే మరిమితమవుతుందా అనేది వేచి చూడాలి!