Begin typing your search above and press return to search.

'పొంగులేటి కాంగ్రెస్ ' VS ' ఒరిజిన‌ల్‌ కాంగ్రెస్‌ ' .. పాలేరులో చేయి విరుగుతోందా...!

సూర్యాపేట‌లో పాత కాంగ్రెస్ వాళ్లు ఇత‌ర పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన ప‌టేల్ ర‌మేష్‌రెడ్డిని ఒప్పుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న‌కు టిక్కెట్ రాలేదు

By:  Tupaki Desk   |   15 Nov 2023 5:30 PM GMT
పొంగులేటి కాంగ్రెస్  VS  ఒరిజిన‌ల్‌ కాంగ్రెస్‌  .. పాలేరులో చేయి విరుగుతోందా...!
X

తెలంగాణ‌లో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒరిజిన‌ల్ కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్‌లో టిక్కెట్లు రాకో లేదా ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌సొచ్చి కాంగ్రెస్‌లో చేరిన నేత‌ల కాంగ్రెస్‌ల మ‌ధ్య గ్రూపుల పోరు తారాస్థాయికి చేరుకుంది. ఉదాహ‌ర‌ణ‌కు రేవంత్‌ను ఒరిజిన‌ల్ కాంగ్రెస్ నేత‌లు ఇప్ప‌ట‌కీ ఒప్పుకోలేక‌పోతున్నారు. సూర్యాపేట‌లో పాత కాంగ్రెస్ వాళ్లు ఇత‌ర పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన ప‌టేల్ ర‌మేష్‌రెడ్డిని ఒప్పుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న‌కు టిక్కెట్ రాలేదు. సూర్యాపేట ప‌క్క నియోజ‌క‌వ‌ర్గం అయిన ఖ‌మ్మం జిల్లా పాలేరులోనూ ఒరిజిన‌ల్ కాంగ్రెస్‌... పొంగులేటి కాంగ్రెస్ మ‌ధ్య పోరు పీక్స్‌కు చేరుకుంది. ఇదే పొంగులేటిని ఓడించేలా క‌నిపిస్తోంది.

పాలేరులో గ‌త కొన్నేళ్ల నుంచి క‌రుడుగ‌ట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారు. ఇటీవ‌ల బీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి సంబాని చంద్ర‌శేఖ‌ర్ టైం నుంచి ఎన్నో ఆటుపోట్లు త‌ట్టుకున్న వారు ఇప్ప‌ట‌కీ కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్నారు. పాలేరు జ‌న‌ర‌ల్‌గా మారి సంబాని స‌త్తుప‌ల్లికి వెళ్లాక ఆ త‌ర్వాత రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డిని 2014లో భారీ మెజార్టీతో గెలిపించారు. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం మ‌రో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన‌ప్పుడు చాలా మంది కాంగ్రెస్ వాదుల‌ను బెదిరించో, బ‌తిమిలాడో గులాబీ కండువాలు క‌ప్పేశారు. అప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రాంరెడ్డి స‌తీమ‌ణి సుచ‌రితారెడ్డికి స‌పోర్ట్ చేసి.. ఆ త‌ర్వాత 2018 సాధార‌ణ ఎన్నిక‌ల్లో కందాళ ఉపేంద‌ర్‌రెడ్డిని గెలిపించిన కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు పొంగులేటి గ్యాంగ్ అజ‌మాయిషి, అవ‌మానాలు త‌ట్టుకోలేని ప‌రిస్థితి.

వీరిలో కొంద‌రు మారిన స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరిపోతున్నారు. తుమ్మ‌ల ద్వారా కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన నేత‌లు, పొంగులేటి సొంత టీం, ఇటు కుల సంఘాల ద్వారా ఎదిగిన నేత‌లంతా పొంగులేటి చుట్టూ చేరి క‌రుడుగ‌ట్టిన కాంగ్రెస్ వాదుల‌పై పూర్తిగా పెత్త‌నం చేస్తూ వారిని క‌నుమ‌రుగు చేస్తున్నారు. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్‌లో త‌న‌కంటూ ఓ కేడ‌ర్ ఉన్న మాజీ మంత్రి సంబాని చంద్ర‌శేఖ‌ర్ కూడా బీఆర్ఎస్‌లో చేర‌డంతో ఇప్పుడు పాత‌, క‌రుడుగ‌ట్టిన కాంగ్రెసోళ్లంతా బీఆర్ఎస్‌లోకి జంప్ చేసేస్తున్నారు.

పొంగులేటి ఇప్పుడే ఇట్ల చేస్తుంటే... రేపు గెలిస్తే అస‌లు మ‌మ్మ‌ల‌ను పూర్తిగా తొక్కేస్తాడ‌ని వాళ్ల‌లో ఆవేద‌న క‌ట్ట‌లు తెంచుకుంటోంది. కొంద‌రు ఇప్ప‌టికే పార్టీ మారిపోతుండ‌గా.. మ‌రికొంద‌రు తాము ఎన్నిక‌ల్లో ప‌నిచేయ‌లేమ‌ని తేల్చిచెప్పేస్తున్నారు. ఆ మాట‌కు వ‌స్తే 2016 ఉప ఎన్నిక‌ల్లో సుచ‌రితారెడ్డిని పోటీ చేస్తే స‌పోర్ట్ చేస్తాన‌ని ఒత్తిడి చేసి ఆమె పోటీకి దిగేలా చేసి.. త‌ర్వాత ఆమెకు హ్యాండ్ ఇచ్చి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును గెలిపించాడు. ఇలా పొంగులేటిని న‌మ్ముకున్న కాంగ్రెసోళ్ల‌కు ఎలాంటి గ‌తి ప‌డుతుందో ఇదే పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు.

విచిత్రం ఏంటంటే ఈ పాత కాంగ్రెసోళ్లు 2018లో గెలిపించిన ఉపేంద‌ర్‌రెడ్డితో ఆయ‌న పార్టీ మారినా కూడా ఈ నాలుగేళ్ల‌లో ప‌నులు చేయించుకున్నారు. ఉపేంద‌ర్‌రెడ్డి కూడా త‌నను గెలిపించార‌న్న కృత‌జ్ఞ‌త‌తో వాళ్ల‌కు ప‌నులు చేసిపెట్టాడు. ఇప్పుడు వీళ్ల‌లో చాలామంది ఆయ‌న వెంట వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలు పాలేరు కాంగ్రెస్‌కు క‌మ్మేస్తున్నాయి. అంతిమంగా ఇది పొంగులేటిని చుట్టుముట్టేస్తోంది.