Begin typing your search above and press return to search.

పొంగులేటి, తుమ్మలకు "ఫస్ట్" షాక్... కారణం ఇదేనా?

బీఆరెస్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సుమారు నెలరోజులకుపైగా పొంగులేటి పేరు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   15 Oct 2023 6:35 AM GMT
పొంగులేటి, తుమ్మలకు ఫస్ట్ షాక్... కారణం ఇదేనా?
X

బీఆరెస్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సుమారు నెలరోజులకుపైగా పొంగులేటి పేరు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు వరకూ పోంగులేటితో బీజేపీ నేతలు తీవ్ర చర్చలు జరుపుతున్నారని కథనాలొచ్చాయి. ఇదే సమయంలో ఈటెల రాజేందర్ సై తం వీరితో చర్చలు జరిపారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం సీన్ మారిపోయింది.. చాలా కాలం సస్పెన్స్ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పైగా ఖమ్మంలో భారీ సభపెట్టి, ఆ సభకు రాహుల్ గాంధీని ముఖ్య అతిధిగా పిలిచి మరీ పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో తెలంగాణలో, మరి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు మాంచి మైలేజ్ వచ్చిందనే మాటలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. వీళ్లిద్దరూ కూడా బీఆరెస్స్ నుంచి కాంగ్రెస్‌ లో చేరారు. ఆ సమయంలో కేసీఆర్‌ ను ఓడించ‌డ‌మే త‌న ఏకైక ల‌క్ష్యంగా పొంగులేటి పలుమారు మార్లు చెప్పారు.

ఒకానొక దశలో మరో అడుగు ముందుకేసిన ఆయన... ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆరెస్స్ క్యాండిడేట్ ను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం కూడా చేశారు. కట్ చేస్తే... తాజాగా కాంగ్రెస్ పార్టీ తొలివిడతగా 55 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. అనూహ్యంగా ఈ లిస్ట్ లో పొంగులేటి, తుమ్మల పేర్లు లేవు!

అవును... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలివిడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు కనిపించలేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో, మరి ముఖ్యంగా ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. తెర వెనుక ఏమి జరుగుతుందీ అనే చర్చ కార్యకర్తల్లో మొదలైందని అంటున్నారు.

అయితే ఫస్ట్ లిస్ట్ లో వీరిద్దరికీ షాకివ్వడానికి కారణం "పాలేరు" నియోజకవర్గం అని అంటున్నారు విశ్లేషకులు. షర్మిళ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం లేదని తెలిసిన తర్వాత పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వర‌రావు పోటీ కన్ ఫాం అనే మాటలు వినిపించాయి. ఇదే సమయంలో ఖ‌మ్మం సీటును పొంగులేటి ఆశిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొన్ని సమీకరణల వల్ల ఖ‌మ్మం నుంచి తుమ్మల‌, పాలేరులో పొంగులేటి పోటీ చేస్తార‌ని.. ఈ మేర‌కు అంగీకారం కుద‌రింద‌ని ప్రచారం పెద్ద ఎత్తున జ‌రిగింది. దీంతో... తొలి జాబితాలో వీళ్లిద్దరి పేర్లు త‌ప్పకుండా ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ నాయకుడు ఒకటి తలిస్తే అధిష్టాణం మరొకటి తలచిందన్నట్లుగా సీన్ మారిపోయింది.

ఇందులో భాగంగా.. పొంగులేటి, తుమ్మల అనుచ‌రుల‌కు కాంగ్రెస్ అధిష్టానం తాత్కాలిక షాక్ ఇచ్చింది! ఫ‌స్ట్ లిస్ట్‌ లో త‌మ నాయ‌కుల పేర్లు లేకుండా చేసింది. దీంతో... తుమ్మల‌, పొంగులేటి అనుచ‌రులు ఆరా తీస్తున్నారు. అయితే... పాలేరు, ఖ‌మ్మం సీట్లపై ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్ కి రాకపోవడమే దీనికి కారణం అని కన్ క్లూజన్ కి వస్తున్నారని తెలుస్తుంది. అయితే.. ఇదేనా కారణం.. లేక, తెరవెనుక మరేదైనా కారణం ఉందా అనే అనుమానం మరికొందరు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.