Begin typing your search above and press return to search.

పోలీస్ స్టేషన్ లో సజ్జల... పోలీసులపై పొన్నవోలు ఫైర్ ఎందుకంటే..?

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో భాగంగా... పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 11:08 AM GMT
పోలీస్  స్టేషన్  లో సజ్జల... పోలీసులపై పొన్నవోలు ఫైర్ ఎందుకంటే..?
X

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో భాగంగా... పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో సజ్జల వెంట న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, అప్పిరెడ్డి, తలశిల రఘురాం ఉన్నారు.

అవును... గురువారం నాడు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణ కొనసాగుతోంది! ఈ సమయంలో సజ్జలతో పాటు తనను కూడా విచారణాధికారి వద్దకు అనుమతించాలని పొన్నవోలు డిమాండ్ చేశారు. అయితే అందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

ఈ సమయంలో పోలీసులతో లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా.. ఒక న్యాయవాదిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం అంటూ పొన్నవోలు ఆగ్రహం వక్తం చేశారు. ఈ క్రమంలో... విచారణకు సజ్జలను మాత్రమే లోపలకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో.. సజ్జల ఒక్కరే పోలీస్ స్టేషన్ లోకి వెళ్లారు.

ఈ సందర్భంగా స్పందించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి... సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ నెల 24 వరకూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వ్యులు ఇస్తే 10వ తేదీన లుక్ ఔట్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దాడి జరిగిన రోజు మంగళగిరికి సుమారు 500 కిలో మీటర్ల దూరంలో సజ్జల ఉన్నట్లు కోర్టులో ఆధారాలు సమర్పించామని అన్నారు.

పోలీసులకు ఎలాగైతే విచారించే అధికారం ఉంటుందో.. నిందితులకు కూడా హక్కులు ఉన్నాయని.. ఈ కేసును రకరకాలుగా తిప్పుతున్నారని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. మరోపక్క... పోలీస్ స్టేషన్ లో సజ్జలను మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, రూరల్ సీఐ శ్రీనివాస రావు విచారిస్తున్నారు!