Begin typing your search above and press return to search.

ఆవు నెయ్యి కంటే జంతువుల కొవ్వు ఖరీదు... లాజిక్ మిస్ ?

ఈ ఆరోపణల కంటే హాస్యాస్పదం వేరొకటి లేదని ఆయన అన్నారు.

By:  Tupaki Desk   |   24 Sep 2024 3:28 AM GMT
ఆవు నెయ్యి కంటే జంతువుల కొవ్వు ఖరీదు... లాజిక్ మిస్ ?
X

నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు అన్న టీడీపీ కూటమి ఆరోపణల మీద వైసీపీ నేత, ఏపీ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవు నెయ్యి కంటే నాలుగు రెట్లు ఖరీదు అయిన జంతువుల కొవ్వును అందులో ఎలా కలుపుతారు అని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు.

ఈ ఆరోపణల కంటే హాస్యాస్పదం వేరొకటి లేదని ఆయన అన్నారు. బహిరంగ మార్కెట్ లో చూస్తే జంతువుల కొవ్వు ధర ఏకంగా 450 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా ఉందని ఆయన అన్నారు. టీటీడీ కొనుగోలు చేసే నెయ్యి కిలో 320గా ఉంటే జంతువుల కొవ్వుతో నెయ్యి ఎలా కల్తీ అవుతుంది అని లాజిక్ పాయింట్ తో కూటమి నేతలను ప్రశ్నించారు.

ఇత్తడి బంగారంలో కరగవచ్చు కానీ బంగారం ఇత్తడిలో కరిగిపోతుందా ఏ మాత్రం అయినా బుద్ధితో ఆలోచించే మాటలేనా ఇవి అని పొన్నవోలు ఎద్దేవా చేశారు. ఇలా ఏది పడితే అవి ఆరోపణలు చేస్తూ చులకన కావడంతో పాటు లాజిక్ ని కూడా మిస్ అయ్యారు అని ఆయన టీడీపీ కూటమి నేతల మీద విమర్శలు సంధించారు. ఏది ఏమైనా అగ్గిలా రాజుకున్న ఈ వివాదం ఇప్పట్లో ఆగదని దీనికి సంబంధించి అన్ని రకాలైన వాస్తవాలు సిట్ విచారణలో బయటపడవని ఆయన అన్నారు. అందువల్లనే రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణ అవసరమని పొన్నవోలు అంటున్నారు.

మరో వైపు పొన్నవోలు ఇదే అంశం మీద మాట్లాడుతూ సిట్ విచారణలో కొత్తగా ఏమి చెబుతారని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని జంతువుల కొవ్వు వాడారు అని చెప్పాక సిట్ విచారణ దానికి భిన్నంగా జరుగుతుందా వాస్తవాలు కూడా ఏమీ బయటపడకుండా ఉంటాయి కదా అని కూడా అన్నారు.

దీనిని బట్టి చూస్తే సుప్రీం కోర్టు ద్వారా న్యాయ విచారణకు పొన్నవోలు పట్టుబడుతున్నారు. ఇంతకీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బాగా పాపులర్ అయింది చంద్రబాబుని గత ఏడాది సెప్టెంబర్ లో జైలులో పెట్టించి యాభై రోజుల దాకా ఉంచిన కేసులో వాదించి అన్నది అంతా గుర్తు చేస్తున్నారు. మళ్లీ ఆయన ఇపుడు రంగంలోకి దిగారు ఏమి జరుగుతుందో అని అంటున్నారు.