Begin typing your search above and press return to search.

"బీ బ్రేవ్"... సాయిరెడ్డికి మద్దతుగా రంగంలోకి పూనమ్ కౌర్!

ఈ నేపథ్యంలో స్పందించిన పూనమ్ కౌర్... సాయిరెడ్డికి మద్దతుగా ట్వీట్ చేశారు.

By:  Tupaki Desk   |   15 July 2024 12:33 PM GMT
బీ బ్రేవ్... సాయిరెడ్డికి మద్దతుగా రంగంలోకి పూనమ్  కౌర్!
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కి సంబంధించి వచ్చిన ఆరోపణల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై శాంతి ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా... తాజాగా విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగాపై పలు మీడియా సంస్థలపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ స్పందించారు.

అవును... గత రెండు రోజులుగా దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి పై వస్తోన్న కథనాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. శాంతి (మాజీ) భార్తగా మదన్ మోహన్ ఫిర్యాదు చేయడం.. తన భార్య గర్భం దాల్చడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందంటూ ఫిర్యాదు ఇచ్చినట్లుగా ఆ లేఖలో ఉందని కథనాలు రావడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఈ నేపథ్యంలో స్పందించిన సాయిరెడ్డి... ఓ సెక్షన్ ఆఫ్ మీడియాపై విరుచుకుపడ్డారు. వాడు, వీడూ అంటూ కొంతమంది జర్నలిస్టుల పేర్లు చెప్పి ఫైరయ్యారు. ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు కనీసం తనను సంప్రదించకుండా తప్పుడు కథనాలు ప్రసారం చేశారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో స్పందించిన పూనమ్ కౌర్... సాయిరెడ్డికి మద్దతుగా ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా... ఇప్పుడు టీవీ ఛానల్స్ అంటేనే బ్లాక్ మెయిలింగ్ ఇనిస్టిట్యూట్స్ గా మారిపోయాయని.. అవి బ్లాక్ మెయిల్ చేయడమే పనిగా పెట్టుకున్నాయని.. తమ అజెండాలకు తగ్గట్టుగా తలొంచేలా చేస్తోందని మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇలా మీడియా ముందుకు వచ్చి ఓ మహిళా అధికారి, గిరిజన మహిళకు అండగా నిలబడటాన్ని ప్రశంసిస్తున్నట్లు తెలిపారు పూనమ్.

ఇదే సమయంలో... తన విషయంలోనూ ఇలాంటి క్రమాన్నే వాడారని గతన్ని గుర్తు చేసుకున్న పూనమ్ కౌర్... తనకు ప్రెగ్నెంట్ అయ్యిందని, మనీ తీసుకున్నానని, పని కోసం ఇలా చేసిందని చెప్పారని.. మనం ఏడిస్తే, కన్నీరు కారిస్తే అది వారి విజయం అవుతుందని.. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటివారి ముందు తల వంచకండని కోరారు.

ఈ విధంగా.. "మీడియా ఇలాంటి అబద్దపు వార్తలను సృష్టిస్తుంది.. కావాలంటే ఫ్రూప్స్ కూడా చూపిస్తుంది.. కానీ మహిళలు ధైర్యంగా నిలబడాలి.. మీ వ్యక్తిత్వాన్ని కాపాడే వ్యక్తులు కూడా ఉంటారు.. విజయసాయి రెడ్డి గారు నిజాన్ని వెలికి తీసి, అందరికీ శిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నాను.. మీ వెంటే నేనుంటా.. మీరు ఈ పోరాటాన్ని వదిలి పెట్టకండి.. ధైర్యంగా ఉండండి" అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.