Begin typing your search above and press return to search.

సైకో వెధవ.. లోఫర్.. బేవార్స్.. తిరుగుబోతు.. అరెస్టు వేళ గుర్తుకొస్తున్నాయి!

హైదరాబాద్ మహానగరంలోని బయోడైవర్సిటీ పార్కుకు సమీపంలోని అత్యంత ఖరీదైన మైహోం భూజాలో ప్రముఖ సినీనటుడు పోసాని క్రిష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Feb 2025 4:58 AM GMT
సైకో వెధవ.. లోఫర్.. బేవార్స్.. తిరుగుబోతు.. అరెస్టు వేళ గుర్తుకొస్తున్నాయి!
X

హైదరాబాద్ మహానగరంలోని బయోడైవర్సిటీ పార్కుకు సమీపంలోని అత్యంత ఖరీదైన మైహోం భూజాలో ప్రముఖ సినీనటుడు పోసాని క్రిష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులతో పోసాని వాదనకు దిగటం.. నోటీసులు తీసుకోనని.. సంతకం పెట్టనని మొండికేయటం.. కావాలంటే అరెస్టు చేసుకోవాలని చెప్పటం.. మళ్లీ మాట మార్చటం.. అంతలోనే పోసాని సతీమణికి నోటీసులు ఇచ్చి.. సంతకం పెట్టాలని చెప్పగా.. అందుకు స్పందించిన పోసాని నోటీసుల మీద సంతకం చేయొద్దని చెప్పటం లాంటివెన్నో బయటకు వచ్చిన వీడియోల్లో ఉన్నాయి. తనకు ఇటీవలే సర్జరీ జరిగిందని.. ఆరోగ్యం బాగోలేదని.. మందులు వేసుకోవాలని చెప్పగా.. మెడిసిన్స్ వేసుకొమ్మని పోలీసులు చెప్పటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోసానిని అరెస్టు చేయటమా? ఆయన్ను అరెస్టు చేసేంత తప్పులు ఏం చేశారు? లాంటి ప్రశ్నలు కొందరు అమాయకంగా వేస్తున్న వేళ.. ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఎంత దారుణంగా.. అరాచకంగా ఉంటాయన్న విషయాన్ని చెప్పే చిట్టి వీడియోలు బయటకు వచ్చి వైరల్ గా మారాయి. వివిధ ప్రెస్ మీట్లలో తన నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడేసిన మాటల వీడియోలు భారీగా సర్క్యులేట్ అయ్యాయి.

ఆ వీడియోల్ని చూసినంతనే.. అరెస్టులో న్యాయం ఉందన్న భావన కలిగేలా సదరు వీడియోలు ఉండటం గమనార్హం. నలుగురిని కూర్చొబెట్టుకొని మాట్లాడే వేళలో.. గౌరవప్రదంగా మాట్లాడానికి భిన్నంగా.. నోటికి వచ్చినట్లుగా బూతులు తిట్టేయటం.. వాటి అర్థం కూడా పోసానికి తెలుసా? లేదా? అన్న రీతిలో ఆయన విరుచుకుపడటం లాంటివి గతంలో చేశారు. నోరు తెరిస్తే చాలు.. పచ్చి బూతులు డ్రైనేజిలో మురికిలా అనర్గళంగా ప్రవహించే తీరును ఆయన చాలా ప్రెస్ మీట్లలో ప్రదర్శించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా ఎంత దారుణమైన రీతిలో బూతులు తిట్టారన్న దానికి నిదర్శనంగా.. ఆయన నోటి నుంచి వచ్చిన కొన్ని బూతుల్ని గుర్తు తెచ్చుకుంటే.. చేసిన పనికి తగ్గ ఫలితాన్ని తాజాగా ఆయన అనుభవిస్తున్నారన్న భావన కలుగక మానదు. సంబంధం లేని అంశాలపై నిప్పులు చెరుగుతూ.. వ్యక్తిత్వాన్ని దారుణంగా హననం చేయటమే కాదు.. ఆ వీడియోల్ని సదరు కుటుంబాల వారు చూస్తే.. తీవ్రమైన మనో వేదనకు గురి చేసేలా పోసాని మాటలు ఉండేవి.

పోసాని ప్రెస్ మీట్ టీవీ చానళ్లలో వస్తుంటే.. టక్కున ఛానల్ మార్చేయాల్సిన పరిస్థితి. బీప్స్ లేకుండా మాట్లాడే ఆయన మాటలు వినేందుకు సామాన్యులకు సైతం మనసు ఒప్పేది కాదు.. అంత దారుణంగా వ్యాఖ్యలు చేసేవారు. పోసాని అరెస్టు సందర్భంగా పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు.. అందుకు వాడిన భాషను పలువురు గుర్తు తెచ్చుకుంటున్నారు. వెనుకా ముందు చూసుకోకుండా.. రేపటి రోజున ఏమవుతుందన్న సోయి లేకుండా మాట్లాడిన మాటలకు ఆయన ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాయటానికి కూడా ఇబ్బంది పడే ఎన్నో మాటల్ని ఆయన తన ప్రెస్ మీట్ లో వాడేసేవారు. యూట్యూబ్ వీడియోల్లో ఎడిట్ అన్నది లేకుండా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కానీ.. రాసే వేళలో ఆ మాటల్ని యథాతధంగా రాయలేనంత దారుణంగా ఉంటాయి.పోసాని నోటి నుంచి వచ్చిన బూతుల్లో కొన్నింటిని.. అది కూడా రాయటానికి ఇబ్బంది లేని మాటల్ని చూస్తే..

- సైకో వెధవా

- దరిద్రపు నా...కొ..

- దొంగ

- లోఫర్

- బేవార్స్

- తిరుగుబోతు

- తాగుబోతు

- చేతకాని నా కొ..

- ఆంబోతు..

- దొంగ ల.... కొ...

- పుల్లకు చీర కట్టినా చూస్తావ్.. ఆ అమ్మాయి ఎవరని!

- నీచుడా

- సిగ్గు లేని నా కొ..

- పార్టీ లాగేసుకోవటానికి అమ్మాయిల్ని పంపించాడు

- బ్రోకర్ గాడివి..

- రక్తకన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొ..!