పోసానికి నో గ్యాప్...మరో కేసులో విజాయవాడకు తరలింపు!
సినీరంగంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులతో పోసానిపై వివిధ సెక్షన్స్ కింద ఓబులవారి పల్లె పొలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 March 2025 10:57 AM ISTసినీరంగంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులతో పోసానిపై వివిధ సెక్షన్స్ కింద ఓబులవారి పల్లె పొలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం పోసాని కృష్ణమురళికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మరో కేసులో కర్నూలు నుంచి విజయవాడకు పోసానిని పోలీసులు తరలిస్తున్నారు.
అవును... పోసానిపై వివిధ సెక్షన్ల కింద ఓబులవారిపల్లె పోలీసుల్లు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా.. అతనికి బెయిల్ ఇవ్వకూడదని పోలీసు తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే.. కడప మొబైల్ కోర్టు పోసాని తరుపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ.. బెయిల్ మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో మరో కేసు నిమిత్తం పోసానిని కర్నూలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... విజయవాడలోని భవానీపురం పీఎస్ లో పోసానిపై కేసు నమోదైంది. దీంతో... పీటీ వారెంట్ పై ఆయనను అక్కడకు తీసుకువెళ్లేందుకు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది.
వాస్తవానికి.. శుక్రవారం అర్థరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్ ను కోర్టు రద్దు చేసింది. దీంతో.. విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూలు జైలుకు చేరుకున్నారు. అనంతరం.. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ (పీటీ వారెంట్) కింద పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు!