Begin typing your search above and press return to search.

రాజంపేట టు గుంటూరు.. ఇప్పుడు ఆదోనికి 'పోసాని'

వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి ని గుంటూరు జిల్లా జైలు నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి పోలీసులు తరలించారు.

By:  Tupaki Desk   |   4 March 2025 7:09 PM IST
రాజంపేట టు గుంటూరు.. ఇప్పుడు ఆదోనికి పోసాని
X

వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి ని గుంటూరు జిల్లా జైలు నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి పోలీసులు తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, ఆయనపై కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా, మంగళవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు చేరుకుని, పోసానిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతన్ని ఆదోనికి తరలించారు. ఈ చర్యలపై వైకాపా వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

పోసానిపై ఇప్పటికే పలుచోట్ల కేసులు నమోదై ఉండటంతో, ఆయనకు మరోసారి న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామాలపై అధికార, విపక్ష పార్టీల నేతలు సైతం స్పందించనున్నారు.

ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. పోసాని భవిష్యత్‌ లో మరిన్ని విచారణలు కొనసాగనున్నాయని సమాచారం. కేసుల మీద కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేయనున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 17 కేసులను పోలీసులు ఫైండ్ అవుట్ చేశారని.. వరుసగా వాటన్నింటిలోనూ అరెస్ట్ లు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోసానిని కేసుల విషయంలో తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.