ఆర్జీవీని మర్డర్ చేయడానికి ప్లాన్... లోకేష్ "ఎస్" - చంద్రబాబు "నో"!
ఈ సమయంలో తాజాగా మరోసారి సంచలన ఆరోపణలతో మైకులముందుకు వచ్చారు పోసాని. ఈ సందర్భంగా ఆర్జీవీ మర్డర్ ప్లాన్ అనే అంశం ప్రస్థావించడం గమనార్హం.
By: Tupaki Desk | 23 April 2024 4:25 AM GMTఏపీలో జగన్ పై ప్రత్యర్ధులు.. ప్రధానంగా చంద్రబాబు, లోకేష్, పవన్ లు ఏమైనా విమర్శలు చేస్తే... వెంటనే మైకులముందుకు వచ్చేవారిలో ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఒకరనే సంగతి తెలిసిందే. చంద్రబాబు తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే అంటూ... చెప్పే మాటలు, చేసే విమర్శలు, సంచలన ఆరోపణలు ఎప్పుడూ వైరల్ గా మారుతుంటాయి. ఈ సమయంలో తాజాగా మరోసారి సంచలన ఆరోపణలతో మైకులముందుకు వచ్చారు పోసాని. ఈ సందర్భంగా ఆర్జీవీ మర్డర్ ప్లాన్ అనే అంశం ప్రస్థావించడం గమనార్హం.
అవును... ఇటీవల జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై పోసాని సంచలన విషయాలు వెల్లడించారు. అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రమాదకారని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో... ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ హత్యకు టీడీపీ నాయకత్వం కుట్ర పన్నిందంటూ సంచలన ఆరోపణలు చేసిన పోసాని కృష్ణ మురళి... ఈ సందర్భంగా పలువురి పేర్లు తెరపైకి తెస్తూ.. "నా తల్లి సాక్షిగా చెబుతున్నా" అని చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఇందులో భాగంగా... సీఎం జగన్ కు మద్దతు తెలిపిన ఆర్జీవీని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి, ఆ తర్వాత ఆగారని మొదలుపెట్టిన పోసాని.. ఈ విషయం తాను ఆర్జీవీకి కూడా చెప్పలేదని అన్నారు. మంచి చేసిన పాలకులకు మద్దతు పలికితే చంపేస్తారా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో... ప్రముఖ జర్నలిస్టు ఐ. వెంకట్రావు కుమారుడు అనిల్ ముఖ్యుడని.. అతడు ప్లాన్ చేస్తే, ఆ విషయాన్ని రాజేశ్ కిలారుతో పంచుకున్నాడని. తన తల్లి సాక్షిగా చెప్తున్నట్లు పోసాని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా తనకు తన కమ్మ వాళ్లే చెప్పారని.. ఈ మర్డర్ కు నారా లోకేష్ కూడా ఒకే అన్నారని.. అయితే చంద్రబాబు మాత్రం దానికి నో అన్నారని పోసాని తెలిపారు. ఈ సందర్భంగా... ఆర్జీవీ ఓ పిచ్చోడు, అతన్ని చంపితే మనకొచ్చేదేముంది, వదిలేయండి అని చంద్రబాబు వారితో అన్నారని వెల్లడించారు. ఆర్జీవీ స్థానంలో రేపు తానే ఉండొచ్చని.. అయినా తాను లెక్కచేయనని.. ఓడిపోతే మనిషికి లక్ష రూపాయలు ఇచ్చి మళ్లీ గెలవండి కానీ, హత్యలు చేయకండి అని పోసాని అన్నారు.
ఇదే క్రమంలో... చంద్రబాబూ.. దయచేసి మంచి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ హత్యకు కుట్రలు పన్నకండి అని కోరిన పోసాని... తనను చంపినా పరవాలేదు కానీ ప్రజల మనిషి సీఎం జగన్ ను మాత్రం హత్య చేయకండని.. ఆయన జోలికి మాత్రం రావొద్దని.. ఆయన్ని చంపితే ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను చంపినట్టేనని.. ఫలితంగా రాష్ట్ర ప్రజల జీవితాలు, భవిష్యత్తు నాశనం అవుతాయని తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అవుతున్నాయి!