నేను చచ్చిపోతే బ్రాహ్మణి భర్తే కారణం... పోసాని సంచలన వ్యాఖ్యలు!
అవును... మంగళగిరిలో కోర్టు చుట్టూ తిప్పించే క్రమంలో తనను హత్య చేయడానికి కుట్ర పన్నాడని పోసాని సంచలన ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 22 Aug 2023 12:54 PM GMTటీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తనపై పరువు నష్టం దావా వేయడంపై ఏపీ చలనచిత్రాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే తనపై కక్ష గట్టారంటూ ధ్వజమెత్తారు. తాజాగా సచివాలయంలో ఆయన చంద్రబాబు, లోకేష్ ద్వయంపై విరుచుకుపడ్డారు.
హెరిటేజ్ ఆస్తులు నీవి కావా?
లోకేష్ తనపై వేసిన రూ.4 కోట్లకు పరువు నష్టం దావాపై పోసాని స్పందించారు. కంతేరులో 14 ఎకరాలు కొన్నారని తాను అన్నానని పరువు నష్టం దావా వేశారని అన్నారు. ఈ సందర్భంగా... అల్ ఖైదా పేరు చెబితే బిన్ లాడెన్ గుర్తుకు వచ్చినట్టు, హెరిటేజ్ అంటే చంద్రబాబు గుర్తుకు రాడా? హెరిటేజ్ ఆస్తులు నీవి కావా? అంటూ ప్రశ్నించారు పోసాని.
హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నమాట నిజంకాదా? అసలు లోకేష్ ఎవరిపై విమర్శలు చేయలేదా? అని పోసాని సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన లోకేష్ పై.. పరువు నష్టం దావా వేయకూడదా? అని ఈ సందర్భంగా పోసాని నిలదీశారు.
బూతుల కంటే బూతు పనులే డేంజర్:
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడిన బూతుల వీడియోను ప్రదర్శించిన పోసాని... బూతుల కంటే బూతు పనుల వల్లే సమాజానికి ఎక్కువ నష్టం అని చెప్పుకొచ్చారు. రామోజీరావుని బ్రోకర్ అనే అన్నానని తెలిపారు. ఈ సందర్భంగా... చంద్రబాబు, రామోజీరావు ఇద్దరూ కూర్చుని గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని వస్తుందని ఆరు నెలల ముందే డిసైడ్ చేశారని అన్నారు.
రాజధాని భూములలో త్యాగాలు లేవు.. అంతా వ్యాపారాలే ఉన్నారని, గన్నవరంలో భూములు పోతే రాజధాని ప్రాంతంలో అశ్వనీదత్ కి ఎందుకు భూములిచ్చారని పోసాని నిలదీశారు.
లోకేష్ వల్ల ప్రాణహాని:
పరువు నష్టం దావా వ్యవహారంలో తనను మంగళగిరికి పిలిపించుకుని, కోర్టు చుట్టూ తిప్పాలనేది ఈ మాజీ మంత్రి నారా లోకేష్ ఉద్దేశమని పోసాని మండిపడ్డారు. ఆ సమయంలో తనను హత్య చేయడానికి కుట్ర పన్నాడని, దీని కోసం తెరవెనుక ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయని పోసాని ఆరోపించారు.
అవును... మంగళగిరిలో కోర్టు చుట్టూ తిప్పించే క్రమంలో తనను హత్య చేయడానికి కుట్ర పన్నాడని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. నారా లోకేష్ కొంతమంది విదేశీ అమ్మాయిలతో చెట్టాపట్టాలేసుకుని అర్ధనగ్నంగా తిరగడానికి సంబంధించిన ఫొటోలను బయటపెట్టాననే కక్షతో తనపై రగిలిపోతున్నాడని అన్నారు.
అలాంటి ఫొటోలను బయటికి రావడం వల్ల తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని నారా లోకేష్ భయపడుతున్నాడని.. అందుకే తనను మట్టుపెట్టాలని కుట్ర పన్నాడని పోసాని అన్నారు. దీనికి సంబంధించిన పక్కా సమాచారం తన వద్ద ఉందని వివరించారు. తన మరణించానంటే దానికి కారణం నారా లోకేషేనని ఈ సందర్భంగా పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేష్ అంటే ఎవరో అనుకోవద్దు:
తాను మరణిస్తే అందుకు కారణం నారా లోకేషే అని వ్యాఖ్యానించిన అనంతరం... నారా లోకేష్ అంటే ఎవరో అనుకోవద్దని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొన్ని గుర్తులు చెప్పారు.
"నారా లోకేష్ అంటే చాలామంది ఉంటారు.. ఎవరో అనుకోవద్దు! చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త.. అతనే నా చావుకు కారణమౌతాడు" అని పోసాని స్పష్టం చేశారు.
టీడీపీలోకి ఆహ్వానించారు:
ఈ సందర్భంగా తనను తెలుగు దేశం పార్టీలోకి ఆహ్వానించారంటూ పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా లోకేష్ పీఏ చైతన్య తనకు ఫోన్ చేశాడ.. తనకు అనారోగ్యంగా ఉందని తెలిసి పరామర్శించటానికి వస్తానన్నాడని పోసాని తెలిపారు.
ఈ క్రమంలో మరలా పది రోజులకు ఫోన్ చేసి టీడీపీలో చేరాలని అడిగారని ఈ సందర్భంగా పోసాని గుర్తుచేసుకున్నారు! ఈ సందర్భంగా తాను నారా లోకేష్ కంటే ఎంతో విశ్వసనీయత ఉన్న నాయకుడినని, అమ్ముడుపోయే వాడిని కాదని పోసాని చెప్పారు
ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్థుడు!:
ఈ సందర్భంగా ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్థుడు చంద్రబాబు అని మొదలుపెట్టిన పోసాని... అందుకే ఎన్ని కేసులు ఉన్నా జైలుకు వెళ్లలేదని తెలిపారు. పుంగనూరులో ఏకంగా పోలీసులపై కూడా హత్యా ప్రయత్నం చేశారని అన్నారు.
ఇలా.. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే తనపై కక్ష గట్టారని.. అందుకే తనపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే కొంతమందికి కులం పిచ్చి ఎక్కించి తనను తిట్టిస్తున్నారని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆపనిచేస్తే... భూములన్నీ ఉచితంగా ఇచ్చేస్తా:
పెదకాకానిలో నాకు 16 ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు.. ఒక్క ఎకరం ఉందని నిరూపించినా రాసిస్తా అని చెప్పిన పోసాని.. ఈ సందర్భంగా కీలకమైన ఆఫర్ ఇచ్చారు!
అమరావతిలో ఐదు శాతం భూములు పేదలకు ఇవ్వాలని చట్టం ఉంది. ఆ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారు అని గుర్తుచేసిన పోసాని... "అవసరమైతే నా భూములన్నీ పేదలకు ఉచితంగా ఇచ్చేస్తా.. పేదల భూములపై కేసులు వెనక్కి తీసుకోండి" అని అమరావతి రైతుల్ని ఉద్దేశించి పోసాని వ్యాఖ్యానించారు.