Begin typing your search above and press return to search.

'మాకేం కర్మండీ'... భువనేశ్వరిపై పోసాని సంచలన వ్యాఖ్యలు!

అవును... నేడు చంద్రబాబు, లోకేష్ లు ఇంత నాశనం కావడానికి భువనేశ్వరే కారణం అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   2 Oct 2023 7:55 AM GMT
మాకేం కర్మండీ... భువనేశ్వరిపై పోసాని సంచలన వ్యాఖ్యలు!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో 4వతేదీన లోకేష్ సీఐడీ ముందు విచారణకు హాజరవుతున్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అయితే ఈరోజు తండ్రీకొడుకులిద్దరూ ఇలా అయిపోవడానికి కారణం భువనేశ్వరి అంటూ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... నేడు చంద్రబాబు, లోకేష్ లు ఇంత నాశనం కావడానికి భువనేశ్వరే కారణం అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలులో ములాకత్ అనంతరం బయటకు వచ్చిన భువనేశ్వరి... తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారు.. తమకేం కర్మ అని.. హెరిటేజ్ లో రెండు శాతం అమ్ముకుంటే నాలుగు వందల కోట్లు వస్తాయని పబ్లిక్ గా చెప్పారని పోసాని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తాను ఒక ప్రశ్న అడగదలచుకున్నానని మొదలుపెట్టిన ఆయన... ఒకసారి గతానికి వెళ్లారు!

ఇందులో భాగంగా... 1983కి ముందు చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ బిక్ష పెట్టిందని, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత... టీడీపీలోకి వెళ్లాలని ప్లాన్ చేశారని... అనంతరం, నాడు ఎన్టీఆర్ పై ఛాలెంజ్ చేసి, ఎన్టీఆర్ ని ఓడిస్తానని చెప్పిన చంద్రబాబుని మరళా టీడీపీలోకి ఎలా పంపించారని పోసాని ప్రశ్నించారు!

ఆ రెండు సమయాల్లోనూ... "చంద్రబాబు ను భువనేశ్వరే చెడగొట్టారు, బుద్ది చెప్పలేకపోయారు" అంటూ పోసాని ఫైరయ్యారు. "ఏవండీ... కాంగ్రెస్ పార్టీ మనకు రాజకీయ బిక్ష పెట్టింది.. అలాంటి పార్టీని వదిలేయడం కరెక్ట్ కాదు" అని నాడు ఎందుకు చెప్పలేకపోయారని పోసాని ఫైరయ్యారు. అసలు అలా పార్టీలు మారాల్సిన అవసరం ఏముంది... "మనకేం కర్మండీ" అని అనలేదే అని ప్రశ్నించారు.

రెండు శాతం షేర్లు అమ్మితేనే 400 కోట్లు వస్తాయి "మాకేం కర్మ" అని నేడు అంటున్న భువనేశ్వరి... నాడు కాంగ్రెస్ పార్టీ మనకు ఎమ్మెల్యే టిక్కేట్ ఇచ్చింది, గెలిచాక మంత్రి పదవి ఇచ్చింది.. ఇప్పుడు పార్టీ మారడానికి "మనకేం కర్మ" అని నాడు ఎందుకు అనలేదని పోసాని.. భువనేశ్వరిని ప్రశ్నించారు. అనంతరం చంద్రబాబు టీడీపీలోకి రావడానికి కూడా కారణం భువనేశ్వరే అని అన్నారు.

అనంతరం... "తండ్రి సెంటిమెంటు - కూతురు సెంటిమెంట్" వాడి ఎన్టీఆర్ ని పిచ్చోడిని చేసి చంద్రబాబును టీడీపీలో జాయిన్ చేసింది కూడా భువనేశ్వరే అని పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ పై చెప్పులు వేయించడం, పార్టీని లాక్కోవడం అన్నీ భువనేశ్వరికి తెలుసని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడమే ఆమెకు హ్యాపీ అని పోసాని చెప్పుకొచ్చారు. నిజంగా ఇది భువనేశ్వరి ఉద్దేశ్యం కాకపోతే... నాడే చంద్రబాబు వైఖరిని ఖండించి ఉండేవారని పోసాని తెలిపారు.

అలాంటి చరిత్ర ఉన్న భువనేశ్వరి నేడు పబ్లిక్ లోకి వచ్చి.. "మాకేం కర్మండీ" అని చెబుతుందని పోసాని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... నేడు డబ్బులు దండిగా సంపాదించుకుని "మాకేం కర్మండీ" అని అంటున్న భువనేశ్వరి... నాడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడవడానికి "మాకేం కర్మండీ" అని ఎందుకు అనలేదని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని కేవలం మీరు, మీ భర్త, మీ కుమారుడే ఏలాలని కోరుకుంటారని పోసాని ఫైరయ్యారు.

ఈ తెలివితేటలతోనే... చంద్రబాబునూ, లోకేష్ నూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి.. వారిని అవినీతిపరులని తీవ్రస్థాయిలో విమర్శించిన పవన్ కల్యాణ్ ను పిలిచి జ్యూస్ తాగించి.. మచ్చిక చేసుకుని.. రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చేలా రిక్వస్ట్ చేసుకున్నారని.. ఎంతకైనా తగినవారంటూ పోసాని తనదైన శైలిలో ఏకపాత్రాభినయం చేస్తూ... భువనేశ్వరి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.