బీఆరెస్స్ - వైసీపీ సంబంధంపై పోసాని కీలక వ్యాఖ్యలు!
ఈ సమయంలో తెలంగాణలో బీఆరెస్స్ ఓడినట్లే.. ఏపీలో వైసీపీ కూడా ఓడిపోతుందంటూ లాజిక్ లేని లాజిక్ మాటలు వినిపిస్తున్నాయంటూ వైసీపీ నేతలు ఫైరవుతున్నారు. ఈ సమయంలో పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 11 Dec 2023 1:13 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ పార్టీ ఓటమి పాలవ్వడం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా టీడీపీ సపోర్ట్ చేసిందని అంటున్నారు. గాంధీ భవన్ వద్ద టీడీపీ జెండాలు దర్శనమివ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో తెలంగాణలో బీఆరెస్స్ ఓడినట్లే.. ఏపీలో వైసీపీ కూడా ఓడిపోతుందంటూ లాజిక్ లేని లాజిక్ మాటలు వినిపిస్తున్నాయంటూ వైసీపీ నేతలు ఫైరవుతున్నారు. ఈ సమయంలో పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయినట్లే ఏపీలో జగన్ కూడా ఓడిపోతారంటూ అర్ధంలేని లాజిక్ లు, కంపేరిజన్లు వినిపిస్తున్నాయంటూ వైసీపీ నేతలు ఫైరవుతున్న నేపథ్యంలో తాజాగా పోసాని కృష్ణమురళి స్పందించారు. ఇందులో భాగంగా అసలు తెలంగాణలో బీఆరెస్స్ కు, ఏపీలో వైసీపీకీ ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. ఒకవేళ తెలంగాణలో బీఆరెస్స్ గెలిచి ఉంటే... ఏపీలో వైసీపీ గెలుస్తుందని చెప్పేవారా అని అడిగారు.
ఆ రాష్ట్రంలో టీడీపీకి అంత కెపాసిటీ ఉంటే ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించిన ఆయన... సపోజ్ జనసేన పోటీచేస్తుంది కాబట్టి టీడీపీ పోటీ చేయలేదు అని అనుకుంటే... ఆ పార్టీకి మద్దతు ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు. జైలుకి వెళ్లి మరీ ఓదార్చి వచ్చిన పవన్ కు తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు సపోర్ట్ చేయలేదో చెప్పాలని ఈ సందర్భంగా పోసాని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఇలాంటి రాజకీయాలు చేసే వ్యక్తిని ప్రపంచంలో తాను ఎక్కడా చూడలేదని.. మీరెవరికైనా తెలిస్తే చెప్పాలని విలేఖరులను కోరారు పోసాని. ఇదే క్రమంలో తన మామనే ముంచిన చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ని ముంచడం పెద్ద విషయం కాదని, ఈ విషయాన్ని కాపు సోదరులకు తాను ఏనాడో చెప్పానని.. తెలంగాణ ఎన్నికలతో అది మొదలైందన్నట్లుగా పోసాని క్లారిటీ ఇచ్చారు.
ఇదే క్రమంలో... అన్నం తినేవాడు, గడ్డి తినని వాడు ఎవడైనా... ఒక రాష్ట్రంలో కలిసి ఉన్న రెండు పార్టీల్లో ఒక పార్టీ పక్క రాష్ట్రంలో పోటీ చేస్తుంటే మద్దతు ఇవ్వాలని.. మరి ఆ మాత్రం సపోర్ట్ కూడా చేయని రాజకీయాలను ఏమనాలో తనకు తెలియదని పోసాని ఫైరయ్యారు. ఇలా సిగ్గు లేని రాజకీయ నాయకుడు గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా వృథా అని పోసాని ముగించారు.