స్నేక్(బాబు)కు పాలు పోసినా... పోతిన మహేష్ కౌంటర్ వైరల్!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాలు ముగిసాయి.. పోలింగ్ కూడా పూర్తయ్యింది.. దీంతో ఫలితాల కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు
By: Tupaki Desk | 19 May 2024 6:07 AM GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాలు ముగిసాయి.. పోలింగ్ కూడా పూర్తయ్యింది.. దీంతో ఫలితాల కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాప్ లో కూడా ఏపీ రాజకీయాల్లో రసవత్తర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా నాగబాబు "మనవాడు - పరాయివాడు.." అంటూ చేసిన ట్వీట్ అనంతరం ఏపీ రాజకీయాల్లో సరికొత్త రచ్చ కం చర్చ మొదలైంది. ఈ సమయంలో... పోతిన మహేష్ ఎంట్రీ ఇచ్చారు.
అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దాదాపు ముగుస్తున్న సమయంలో నాగబాబు ఒక ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే!" అని ట్వీటారు. అక్కడ నుంచి మొదలు నెట్టింట కౌంటర్లు హోరెత్తిపోయాయి. అతు వైసీపీ శ్రేణులు, ఇటు "ఏఏ" ఫ్యాన్స్ నాగబాబును గట్టిగానే తగులుకున్నారు. ఈ నేపథ్యలో ఆయన అకౌంట్ డీ యాక్టివేట్ అయిన పరిస్థితి!
ఆ సంగతి అలా ఉంటే... ఈ గ్యాప్ లో వైసీపీ నేత పోతిన మహేష్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా... "స్నేక్(బాబు)కు పాలు పోసినా అది కాటు వేస్తుంది. వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా. కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా.."? అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు పోతిన మహేష్. దీంతో ఈ ట్వీట్ తో మరో ట్విట్టర్ వార్ మొదలైంది!
ఇదే క్రమంలో... "మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు.. 'నా పేరు సూర్య' సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న "పుష్ప" 2019లో జనసేన పార్టీకి రూ.2 కోట్ల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. 2009, 2019, 2024 అండగా నిలిచిన వారిపై & గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీ ని దగాఫ్యామిలీ అనాలా?" అని కంటిన్యూ చేసారు మహేష్!
అయితే ఇందులో ఎక్కడా నాగబాబు పేరు నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆ ట్వీట్లు చూస్తే మాత్రం అదే అర్థం అయిపోతుందని అంటున్నారు నెటిజన్లు!
కాగా... దీనికంతటికీ కారణం వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా చివరి రోజు అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేయడాన్ని జీర్ణించుకోలేక నాగబాబు చేసిన "మావాడు - పరాయువాడు" ట్వీటే కారణం అని.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయని.. ఆ విషయం పెద్దలు గ్రహించకపోవడం వారి తప్పు కానీ, మిగిలినవారిది కాదని అంటున్నారు నెటిజన్లు!