Begin typing your search above and press return to search.

ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నారా?.. తమిళ మీడియా ఏం చెబుతోంది?

ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ జీవించే ఉన్నారా?.. త్వరలో జనం ముందుకు రాబోతున్నారా?.. అంటే అవుననే అంటోంది తమిళ మీడియా.

By:  Tupaki Desk   |   28 Jan 2025 4:48 AM GMT
ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నారా?.. తమిళ మీడియా ఏం చెబుతోంది?
X

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ 2009 మే నెలలోనే మృతి చెందినట్లు శ్రీలంక సైన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ప్రభాకరన్ మృతిని ధృవీకరిస్తున్నట్లు కొన్ని ఫోటోలను విడుదల చేసింది సింహళ సైన్యం. అయితే.. ఆయన బ్రతికే ఉన్నారని.. మే నెలలో జనం ముందుకు రానున్నరని అంటోంది తమిళ మీడియా.

అవును... ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ జీవించే ఉన్నారా?.. త్వరలో జనం ముందుకు రాబోతున్నారా?.. అంటే అవుననే అంటోంది తమిళ మీడియా. ఇందులో భాగంగా... ఈ ఏడాది మే నెలలో ఆయన జనం ముందుకు రానున్నారంటూ కొన్ని తమిళ పత్రికలు పలు కథనాలు ప్రచురించాయి! దీంతో... ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది.

వాస్తవానికి ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకర్ జీవించి ఉన్నట్లు ఈ ఏడాది మొదట్లో తమిళ జాతీయోద్యమ నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఆయన తన ప్రజల కోసం త్వరలో బయటకు వస్తారు అని పాళ నెడుమారన్ అనే నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు.

ఆ సందర్భంగా నెడుమారన్ మాట్లాడుతూ... ప్రభాకరన్ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నారని.. త్వరలో బయటకు వస్తారని.. తమిళ ఈలం ప్రజలకోసం ప్రకటనలు చేయనున్నారని.. ఈ విషయాన్ని వెల్లడిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా "పెద్ద పులి"ని త్వరలో చూస్తారని అన్నారు!

కాగా.. ఎల్టీటీఈ అధినేత ప్రభాకర్ ను హతమార్చినట్లు 2009లో శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు కొన్ని విడుదలయ్యాయి. డీఎన్ఏ టెస్టులలోనూ అతడి మరణాన్ని ధృవీకరించినట్లు తెలిపింది సింహళ సైన్యం. అప్పటి నుంచి ఎల్టీటీఈ సైలంట్ అయిపోయిందని అంటారు!

ఇక మరణించిన సమయంలో ప్రభాకర్ వయసు 54 ఏళ్లు కాగా.. అతడు మరణించిన సుమారు 14 ఏళ్ల తర్వాత ఆయన బ్రతికే ఉన్నారని, త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నారని ప్రకటన రావడం.. పత్రికల్లో కథనాలు రావడం గమనార్హం.!