రాజీనామా పై రేవంత్ కీలక ఆదేశాలు!?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తేలిపోగానే కొందరు సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు
By: Tupaki Desk | 8 Dec 2023 5:14 AM GMTకాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తేలిపోగానే కొందరు సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇందులో బాగంగానే విద్యుత్ శాఖకు సంబంధించి జెన్కో, ట్రాన్స్ కో సీఎండీగా వ్యవహరించిన ప్రభాకర్ రావు కూడా రాజీనామా చేశారు. ప్రభాకరరావు రాజీనామా విషయమై రేవంత్ రెడ్డి కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభాకరరావు రాజీనామాను ఆమోదించవద్దని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు అని ఒక పొలిటికల్ గాసిప్ వినిపిస్తుంది . ఎందుకంటే శుక్రవారం విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్షా సమావేశం జరగబోతోంది. ఆ సమావేశానికి ప్రభాకరరావును పిలిపించాలని చెప్పారట.
ఇవిషయం ఏమిటంటే మొదటి క్యాబినెట్ సమావేశంలో విద్యుత్ శాఖ ఆర్ధిక పరిస్ధితి పైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు అడిగిన అనేక ప్రశ్నలకు ఉన్నతాధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అప్పులు రు. 85 వేల కోట్లుగా అధికారులు లెక్కలు చెప్పారు. అధికారులు చెప్పిన అప్పును విని రేవంత్ తో పాటు మంత్రులు షాకుకు గురయ్యారట. ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులున్నట్లు కేసీయార్ ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు.
కేసీయార్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ ట్రాన్స్ కో, జెన్కో కు సీఎండీగా ప్రభాకరరావే చక్రంతిప్పారు. సీఎండీ నిర్ణయాలను ప్రశ్నించేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. దాంతో ఆకాశమే హద్దుగా ఆయన కూడా చెలరేగిపోయారు. అలాంటిది ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన మొదటి క్యాబినెట్ సమావేశంలో విద్యుత్ శాఖ అప్పులు రు. 85 వేల కోట్లున్నాయంటే అందరికీ షాక్ కొట్టినట్లయ్యింది.
అధికారులు అప్పుల విషయం చెప్పగానే రేవంత్ మాట్లాడుతు ప్రభాకరరావు రాజీనామాను ఆమోదించవద్దని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. అలాగే శుక్రవారం జరిగే సమీక్షా సమావేశానికి ప్రభాకరరావును కూడా రమ్మని చెప్పాలని చెప్పారు. ప్రభాకరరావు వస్తే ఏమి జరుగుతుందో అనే ఆసక్తి పెరిగిపోతోంది. ఎలాగూ రాజీనామాను చేశారు కాబట్టి అసలు ప్రబాకరరావు సమావేశానికి హాజరవుతారా అన్నది కూడా అనుమానంగానే ఉంది. ఏదేమైనా కేసీయార్ ప్రభుత్వంలో జరిగిన అప్పుల బండారం ఒక్కోక్కటి బయటపడుతోందన్నది మాత్రం నిజం.