జేసీ ప్రభాకర్ రెడ్డికి అస్వస్థత... అసలేం జరిగిందంటే...?
అవును... ఏపీలో పోలింగ్ బూత్ లో ఓట్ల సమరం ముగిసినప్పటికీ.. బయట సమరం మాత్రం ఆగడం లేదు.
By: Tupaki Desk | 15 May 2024 10:38 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయినప్పటికీ.. పోలింగ్ బూత్ బయట సాగుతున్న సమరం మాత్రం ముగియడం లేదు. పోలింగ్ ముగిసి మూడో రోజు అవుతున్నా ఇంకా పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనే ఉంది. మరికొన్ని చోట్ల హౌస్ అరెస్టులు, 144 సెక్షన్లూ కొనసాగుతున్నాయి. ఈ సమయంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.
అవును... ఏపీలో పోలింగ్ బూత్ లో ఓట్ల సమరం ముగిసినప్పటికీ.. బయట సమరం మాత్రం ఆగడం లేదు. ఇందులో భాగంగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. తాడిపత్రిలో టియర్ గ్యాస్ ఎఫెక్ట్ వల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. ఆందోళనకారులను చెదరగొట్టడంలో భాగంగా మంగళవారం కాంచన ఆసుపత్రి సమీపంలో పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు.
ఈ సమయంలో... జేసీ ప్రభాకర్ రెడ్డి సమీపంలోనే టియర్ గ్యాస్ పడిందని అంటున్నారు. దీంతో టియర్ గ్యాస్ ఎఫెక్ట్ తో జేసీ లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురవ్వగా.. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు.
అసలేం జరిగింది...?
ఏపీలో పోలింగ్ సమయంలో మొదలైన ఉద్రిక్తతలు.. మూడో రోజు వచ్చినా ఆగడం లేదు. ఇందులో భాగంగా మంగళవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటివైపు వేలాది మంది టీడీపీ కార్యకర్తలతో బయలుదేరారు జేసీ. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
అయినప్పటికీ జేసీ ముందుకు సాగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ టియర్ గ్యాస్ ఎఫెక్ట్ తోనే జేసీ అనారోగ్యానికి పాల్పడి చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు!!